ఆ లిప్ లాక్స్ కి చాలానే ఇబ్బంది పడిందట

Update: 2017-02-03 02:54 GMT

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే ఆన్ స్క్రీన్ మరియు ఆఫ్ స్క్రీన్ లలో ది బోల్డెస్ట్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ అనటం అతిశయోక్తి కాదేమో. కంగనా రనౌత్ పరిశ్రమ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను బహిర్గత పరిచేటప్పుడు మీడియా ముందు ఎటువంటి దాపరికాలు లేకుండా తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలా ఆవిష్కరిస్తుంటుంది. అందుకే ఎంతటి పెద్ద స్టార్స్ నటించినా కంగనా రనౌత్ నటించే సినిమాలకి కంగనా ఇచ్చే ఇంటర్వ్యూ లే ప్రధాన ప్రచార మార్గం అవుతుంటాయి. తన కెరీర్ తొలినాళ్ళ ముచ్చట్లు చెప్పినా, తనతో ఎంతమంది సినిమా ప్రముఖులు సెక్స్ చేయాలనుకున్నారని చిట్టా విప్పాలనుకున్నా, హ్రితిక్ రోషన్ తో విభేదాలని బహిర్గత పరిచినా, షూటింగ్ సెట్స్ లో వాష్ రూమ్స్ లేని లొకేషన్స్ లో కొండల్లోకి వెళ్లాల్సి వచ్చింది అని నిస్సిగ్గుగా చెప్పాలన్నా కంగనా రనౌత్ కే చెల్లుతుంది.

బాలీవుడ్ లో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించే చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఓంకార, కమీనే, హైదర్ వంటి చిత్రాలతో వసూళ్ల వర్షం కురిపించలేకపోయినప్పటికీ అవార్డుల పంట పండించాడు విశాల్ భరద్వాజ్. ఇప్పుడు ఈ దర్శకుడి నుంచి వస్తున్న రంగూన్ చిత్రం రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంగా తెరకెక్కిన చిత్రం కావటంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సారి విశాల్ మార్క్ తో మల్టీప్లెక్స్ ప్రేక్షకులతో పాటు, కంగనా రనౌత్ బోల్డ్ ఎక్సప్రెస్సివ్ ఇంటర్వ్యూ లు బి,సి సెంటర్లలో కూడా రంగూన్ కి టికెట్ లు తెగే బేరం లా మారిపోయింది. ట్రైలర్ లో సైఫ్ అలీ ఖాన్ మరియు షాహిద్ కపూర్ లతో రొమాన్స్ చేసిన కంగనా రనౌత్ ఈ చిత్రమ్ లో లిప్ లాక్స్ గురించి ప్రస్తావిస్తూ రంగూన్ చిత్రం కోసం ఇద్దరు హీరోలు పెద్ద పెద్ద మీసాలు పెంచటంతో లిప్ లాక్స్ చాలా ఇబ్బంది గా గడిచాయని కానీ వాటిని బాగా ఎంజాయ్ చేయగలిగామని చెప్తూ సినిమా ప్రచారాలలో హీట్ ని పెంచేస్తుంది. ఈ నెల 24 న విడుదలవుతున్న రంగూన్ కి యావత్ భారత దేశం లో ఓపెనింగ్స్ గ్రాండ్ గా వచ్చే విధంగా ఈ ఇంటర్వ్యూ లు ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది.

Similar News