ఆ రోల్ నాకివ్వొచ్చుకదా అన్నాడట!!

Update: 2017-06-21 14:00 GMT

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే భారీ తారాగణం నటిస్తుండగా ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో వెంకటేష్ క్యామియో రోల్ చేస్తున్నట్లు నిన్న మంగళవారం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒకటే కథనాలు ప్రచారం అయ్యాయి. అయితే వెంకీ, పవన్ సినిమాలో నిజంగానే గెస్ట్ రోల్ చేస్తున్నాడట. ఇక ఆ రోల్ కూడా సినిమాలో కేవలం ఐదు ఆరు నిముషాలు మాత్రమే ఉన్నప్పటికీ.... ఆ ఐదారునిమిషాల్లోనే పగిలిపోయే పంచలు పవన్ కి వెంకీ కి మధ్య ఉంటాయంటున్నారు.

ఇక ఆ డైలాగ్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు. మరో పక్క వెంకీ, పవన్ చిత్రంలో చేస్తున్న గెస్ట్ రోల్ మరొకరు చేస్తానని డైరెక్టర్ త్రివిక్రమ్ ని అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అతనెవరో కాదు త్రివిక్రమ్ రూమ్మేట్, టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో అయిన సునీల్. త్రివిక్రమ్ ఏ విషయమైనా సరే సునీల్ తో డిస్కర్స్ చేస్తుంటాడట. అలాగే పవన్ సినిమా కథ ను కూడా సునీల్ తో డిస్కర్స్ చేసేటప్పుడు ఆ ఆరునిమిషాల కేరెక్టర్ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ రోల్ నేను చేస్తానని సునీల్ త్రివిక్రమ్ ని అడగగా..... దానికి త్రివిక్రమ్ నీకు ఆ రోల్ ఇవ్వాలంటే ఇంకా నిడివి పెంచాలని... అంతెందుకు నా నెక్స్ట్ మూవీ లో నీకో మంచి రోల్ ఇస్తానని మాటిచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

Similar News