ఆ మ్యూజిక్ డైరెక్టర్ పై ప్రతీకారమా?

Update: 2018-03-26 05:18 GMT

సూర్య తో కలిసి తమిళ డైరెక్టర్ తెరకెక్కించిన సింగం సీరీస్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. అయితే మొదటి రెండు అంటే సింగం 1 , 2 పార్ట్ లకు మ్యూజిక్ కూడా ఆ సినిమాలు హిట్ అవడానికి అతి ముఖ్య కారణంగా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సింగం మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దగ్గరనుండి పాటల వరకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. సినిమా హిట్ లో మెయిన్ పార్ట్ మ్యూజిక్ కె ఇచ్చేసారు క్రిటిక్స్ అండ్ ప్రేక్షకులు. కానీ ఏమైందో తెలియదు తెలియదు గాని డైరెక్టర్ హరి సింగం 3 కి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని తప్పించి హరీష్ జైరాజ్ కి అవకాశం ఇచ్చారు. అయితే మొదటి రెండు పార్టులలో మ్యూజిక్ కి ఎక్కవ మార్కులిచ్చిన వారు సింగం 3 కి మాత్రం మ్యూజిక్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయారు.

మరి అప్పట్లో సినిమా మ్యూజిక్ విషయంలో దర్శకుడు హరి తీసుకున్న రాంగ్ డెసిషన్ సినిమా విడులయ్యాక కానీ అతనికి అర్ధం కాలేదు. అయితే అప్పుడు దేవిశ్రీ ప్లేస్ ని హరీష్ జైరాజ్ కొట్టేస్తే ఇప్పుడు దేవిశ్రీ, హరీష్ జైరాజ్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతీకారం అనే పెద్ద మాట ఎందుకులే గాని మీరు ఇప్పుడు చదివేది చూస్తే ఇంచుమించు అలానే అనిపిస్తుంది. అదేమిటంటే ఇప్పుడు డైరెక్టర్ హరి తమిళంలో తెరకెక్కిస్తున్న సామీ సినిమా సీక్వెల్ సామి 2 కి దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. మరి ముందుగా హరి సామి 2 కి హరీష్ జైరాజ్ నే మ్యూజిక్ కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు హరీష్ జై రాజ్ ని తప్పించి హరి, దేవి తో జట్టు కట్టాడు.

మరి సామీ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. కానీ ఇప్పుడు సామీ 2 కి హరీష్ ప్లేస్ లో దేవిశ్రీ ఉన్నాడు. అలా అనుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ హరీష్ చేయాల్సిన సినిమాని చేస్తూ హరీష్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు.

Similar News