ఆ నిర్మాతకి లైన్ క్లియర్ చేసిన జక్కన్న

Update: 2017-05-28 10:51 GMT

బాహుబలి ప్రాజెక్ట్ కోసం దాదాపు ఐదు సంవత్సరాలు శ్రమించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి ఆ ప్రాజెక్ట్ ఘన విజయం చిరస్థాయిగా గుర్తుండి పోతుంది. ఇంత భారీ ప్రాజెక్ట్ నుంచి బైట పడిన నాటి నుంచే రాజమౌళి హేండిల్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ పై ఊహాగానాలు వీరవిహారం చేయటం మొదలైపోయింది. ముందుగా రాజమౌళి తదుపరి చేయబోయే చిత్రం మహాభారతం అని వార్తలు ప్రచారంలోకి రాగ రాజమౌళి వాటిని ఖండిస్తూ తనకి ఇప్పటికి వున్న అనుభవం మహాభారతం ని వెండితెరపై ఆవిష్కరించటానికి సరిపోదని స్వయంగా తెలపటంతో ఆ వార్తలు చల్లబడ్డాయి. కానీ ఇప్పటికి కూడా రాజమౌళి తదుపరి సినిమా వివరాలు వెల్లడవ్వలేదు.

బాహుబలి కంటే ముందుగానే దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య రాజమౌళి తో సినిమా కోసం అడ్వాన్స్ కూడా ఇవ్వటం జరిగిపోయింది కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాక ముందే బాహుబలి కోసం తన సమయాన్ని కేటాయించేసాడు రాజమౌళి. ప్రస్తుతానికి రాజమౌళి ఎలాంటి సినిమా తీయాలి, హీరో ఎవరు అనే విషయాలపై క్లారిటీ కి రాలేదు కానీ నిర్మాతగా మాత్రం తన తదుపరి చిత్రం డి.వి.వి.దానయ్య కే అని తేల్చుకున్నాడట. ప్రస్తుతం మహేష్-కొరటాల కాంబినేషన్ లో 'భరత్ అను నేను' ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో వున్న నిర్మాత డి.వి.వి.దానయ్య ఎంత బడ్జెట్ అయినా రాజమౌళి ప్రాజెక్ట్ చెప్పిన సమయానికి సెట్స్ పైకి తీసుకెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే రాజమౌళి మాత్రం ఇప్పుడు చేయబోయే చిత్రం తక్కువ ఖర్చుతో, విజువల్ ఎఫెక్ట్స్ తో సంబంధం లేని చిత్రం అవ్వాలని కోరుకుంటున్నా అని పదే పదే చెప్తున్నాడు.

Similar News