ఆ దర్శకుడి చిత్రానికి 100 కోట్లా?

Update: 2016-11-29 16:49 GMT

నాచురల్ స్టార్ నాని నటించిన పిల్ల జమిందార్ చిత్రంతో దర్శకుడిగా పరిచయ చిత్రంతోనే భారీ విజయాన్ని నమోదు చేసాడు అశోక్. తరువాతి కాలంలో ఆది కథానాయకుడిగా సుకుమారుడు చిత్రాన్ని తెరకెక్కించి కెరీర్ పరంగా చాలా నష్ట పోయాడు ఈ దర్శకుడు. ఎప్పుడో 2013 లో విడుదల ఐన సుకుమారుడు తరువాత నేటి వరకు అశోక్ దర్శకత్వంలో మరో చిత్రం విడుదల కాలేదు. కానీ అశోక్ తెరకెక్కించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చిత్రంగధ ఫస్ట్ కాపీ సిద్దమై చాలా కాలం ఐయ్యింది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలలో జాప్యం కొనసాగుతున్న తరుణంలో అశోక్ తన దృష్టిని తదుపరి చిత్రం వైపు మలుచుకున్నారు.

అశోక్ నాలుగవ చిత్రంగా తెరకెక్కుతున్న భాగమతి చిత్రం కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమే కావటం విశేషం. అనుష్క నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షెడ్యూల్ జరుపుకుంటుంది. 2017 ప్రధమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి. అయితే ఇప్పటి నుండే దర్శకుడు అశోక్ తన తదుపరి చిత్రం పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కేరళ లో తిరువనంతపురం పద్మనాభ స్వామీ ఆలయంలో నిధి చుట్టూ సాగే కథ సిద్ధం చేసుకున్నాడు అశోక్. దాదాపు 100 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. కాగా భాగమతి విడుదల తరువాత ప్రేక్షకులు ఇచ్చే తీర్పుతో అశోక్ అంత భారీ వ్యయంతో తెరకెక్కించే చిత్రాన్ని హేండిల్ చేయగలడా లేదా అనేది మార్కెట్ నిర్ణయించనుంది.

Similar News