ఆ డిజాస్టర్స్ కి మెగాస్టార్ రిగ్రెట్ ఫీల్ అవ్వటంలేదట

Update: 2017-05-09 12:08 GMT

అత్యద్భుతమైన సినిమాలు రూపొందించిన దర్శకులే దారుణమైన ఫలితాలు మిగిల్చిన సినిమాల రూపకర్తలాగా కూడా ముద్ర వేసుకున్నారు. ఇలాంటి వారిలో ప్రధమంగా చెప్పుకోవాల్సిన పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన చిత్రాలు విజయం సాధించటం అంటే అవి ట్రెండ్ సెట్ చేసే సినిమాలు, పాత్ బ్రేకింగ్ సినిమాలు అవుతుంటాయి. అదే రామ్ గోపాల్ వర్మ సినిమా పోవటం అంటూ జరిగితే ప్రేక్షకులకి విరక్తి కలిగించే రీతిలో వుంటుంటాయి తప్పితే మోస్తరు ఫలితాలు అనేవి వర్మ కెరీర్ లోనే లేవు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో పాత్ బ్రేకింగ్ సినిమాలను కాక డిజాస్టర్స్ నే ఎక్కువ చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వర్మకి డేట్స్ ఇవ్వటం గమనార్హం.

లేట్ వయసులో కూడా కథానాయకుడిగా విజయాలు అందుకుంటున్న అమితాబ్ బచ్చన్ స్టోరీ టెల్లింగ్ లో తన చార్మ్ ని కోల్పోయి జీవం లేని సినిమాలని రూపొందిస్తు వరుసగా వైఫల్యాలని ఎదుర్కొంటున్న వర్మ కి అమితాబ్ సర్కార్ 3 కోసం డేట్స్ ఇవ్వటం పై చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు సైతం బిగ్ బి చేసిన పొరపాటు అని అభివర్ణించారు. కానీ అమితాబ్ బచ్చన్ కి వర్మపై వున్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. "సర్కార్ బాగా ఆడింది అని సర్కార్ సీక్వెల్ అని వచ్చినవెంటనే వర్మకి డేట్స్ ఇవ్వలేదు. ఆయన ఆగ్, నిశ్శబ్ద్ వంటి మా కాంబినేషన్ లో వచ్చిన పరాజయాలకు కొనసాగింపు చిత్రాలు తీస్తానన్నా, లేక వేరే ఏదైనా కొత్త కథతో వచ్చినా నేను డేట్స్ ఇచ్చేవాడిని. ఆగ్, నిశ్శబ్ద్ వంటి డిజాస్టర్స్ ఎందుకు చేసానా అని నేను ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. వర్మ విజయాపజయాలకి అతీతంగా తన సృజనాత్మకతతో మేకింగ్ లో గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి అతనికి అయితే పాత్ బ్రేకింగ్ మూవీస్ లేదా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి తప్పితే కమర్షియల్ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనే వాటితో వర్మ కెరీర్ కానీ క్రియేటివిటీ కానీ పరిమితం కాలేదు. అందుకే వర్మ దర్శకత్వంలో ఎన్ని సార్లు అవకాశం వస్తే అన్ని సార్లు పని చేయటానికి సిద్ధంగా వున్నాను." అని రామ్ గోపాల్ వర్మ పై తన నమ్మకాన్ని బహిర్గత పరిచారు అమితాబ్ బచ్చన్.

Similar News