ఆ కొరత త్రివిక్రమ్ తో అయినా తీరుతుందేమో?

Update: 2017-10-26 16:29 GMT

తారక్ నటించిన 'జై లవకుశ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఓపెనింగ్స్ వసూళ్లని చూపించి తెగ సందడి చేసింది చిత్ర బృందం. ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్‌ అన్నట్టు ప్రచారం చేసారు. అయితే మొదటి వారం ముగిసే సరికి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. 'స్పైడర్‌' డిజాస్టర్‌ అయినా 'జై లవకుశ' మాత్రం గట్టెక్కలేకపోయింది.

ఏ సినిమా అయిన ఎనభై కోట్లుకి పైగా వస్తే తప్ప విజయవంతం అయినట్టు కాదని ట్రేడ్‌ లెక్కలు చెబుతాయి. అయితే 'జై లవకుశ' మాత్రం డెబ్బయ్‌ కోట్ల షేర్‌తోనే సరిపెట్టింది. అన్ని ఏరియాల్లోను డిస్ట్రిబ్యూటర్లు ఎంతో కొంత లాస్‌ అయ్యారు. అయితే లాస్‌ మరీ తీవ్రంగా లేకపోవడంతో నష్ట పరిహారం కోసం ఎవరూ నిర్మాత కళ్యాణ్‌రామ్‌ దగ్గరకు వెళ్ళలేదు.

ఓవరాల్‌గా యావరేజ్‌ టాక్ తెచ్చుకున్న 'జై లవకుశ' షేర్లు కూడా అలానే వచ్చాయి. ఎన్టీఆర్‌ కెరియర్లో రెండో అతి పెద్ద గ్రాసర్‌గా అయితే నిలిచింది కానీ.... ఎన్టీఆర్‌ చెప్పినట్టుగా ఫాన్స్‌ తల ఎత్తుకు తిరిగే గొప్ప బ్లాక్‌బస్టర్‌ అయితే కాలేకపోయింది. ఎన్టీఆర్‌ నుంచి పక్కా బ్లాక్‌బస్టర్‌ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోతాయి. కనీసం ఎన్టీఆర్.... త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాతో అయిన ఆ కొరత తీరుస్తాడేమో వేచి చూడాలి. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ తో చేస్తున్న ఈ సినిమా ఇంకా సెట్స్ మెదకు వెళ్ళలేదు. వచ్చే సంవత్సరం మార్చ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.

Similar News