ఆ ఇద్దరు మా సినిమాలో లేరు!!

Update: 2017-11-15 13:00 GMT

నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కలయికలో ఒక యాక్షన్ సినిమా ఈ నెల 20 నుండే సెట్స్ మీదకి వెళ్లబోతుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన శివ సినిమా కొట్టిన బ్లాక్ బస్టర్ హిట్ లాంటి హిట్ నే అందుకోవాలని అటు నాగ్ ఇటు వర్మ తహతహ లాడుతున్నారు. అసలు వర్మ కి ఇప్పుడు పిలిచి నాగార్జున అవకాశమిచ్చాడంటేనే... అది పెద్ద విషయం. ఎందుకంటే... వర్మకి ఈ మధ్య కాలంలో హిట్ అనేదే లేదు. అటువంటి టైం లో నాగ్ పిలిచి పిల్లనిస్తాననడం చాలామందికి నచ్చలేదు.కానీ నాగార్జున చాలా విషయాల్లో చాలా కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటాడు. అటు కొడుకుల విషయంలో కానివ్వండి. ఇటు తన కెరీర్ విషయంలో కానివ్వండి. అందుకే కొంతమంది వర్మ ఎలాంటి స్టోరీ తెచ్చాడో అందుకే నాగ్ ఒకే చెప్పాడో అని అంటున్నారు.

టబూ.. అమితాబ్ లపై....

ఇకపోతే నాగార్జున కి జోడిగా టబుని తీసుకుంటున్నారని.. అలాగే వర్మ - నాగ్ సినిమాలో అమితాబ్ కీ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే నాగార్జునకు టబు చాలా క్లోజ్ గనక వర్మ సినిమాలో టబు ఫైనల్ అయ్యిందని అందరు అనుకున్నారు. అలాగే.... అమితాబ్ అటు నాగ్ కి ఇటు వర్మ కి కావాల్సిన వాడు కనుక నిజంగానే అమితాబ్ కూడా వీరి సినిమాలో కీ రోల్ చేస్తున్నాడనే న్యూస్ కూడా గట్టిగానే ప్రచారం జరిగింది.

వర్మ మాట ఇదే...

కానీ వర్మ - నాగ్ సినిమాలో టబు గాని, అమితాబచ్చన్ గాని నటించడం లేదని వర్మ చెబుతున్నమాట. అసలు హీరోయిన్ గా టబుని సంప్రదించలేదని... అసలామె పేరును కూడా పరిశీలించలేదంటున్నాడు. ఇక అమితాబచ్చన్ కూడా తమ సినిమాలో నటించడం లేదని వారిద్దరూ మా సినిమాలో నటిస్తున్నారని న్యూస్ కేవలం ఒట్టి రూమర్ అని అంటున్నాడు వర్మ.

Similar News