ఆ అవసరం ఎన్టీఆర్ రానివ్వలేదు!!

Update: 2017-09-24 12:00 GMT

దర్శకుడు బాబీ తెరకెక్కించిన జై లవ కుశ గత గురువారమే విడుదలై మిశ్రమ స్పందనతో దూసుకుపోతుంది. ఈ చిత్రం మొత్తం మీద ఎన్టీఆర్ చేసిన జై పాత్రకి ఎనలేని పేరొచ్చింది. జై లోని ఉగ్రత్వం, హావభావాలు, రావణుడిగా పాగా ప్రతీకారాలతో రగిలిపోవడం తో జై పాత్ర బాగా హైలెట్ అయ్యింది. అయితే ముందునుండి ఎన్టీఆర్... జై లవ కుశ లో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు.. ఇక ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అంటూ ప్రచారం జరగడమే కాదు ఆ పాత్ర కు ప్రత్యేకమైన మేకప్ ఉండాలనే ఉద్దేశ్యంతో సినిమా మొదలవ్వకముందే చిత్ర బృందం ఓ హాలీవుడ్ మేకప్ నిపుణుడిని హైదరాబాద్ రప్పించిన సంగతి తెలిసిందే.

హావభావాలతోనే....

అయితే ఆ నిపుణుడు ఎన్టీఆర్ కోసం ఒక భయంకరమైన మేకప్ తో కొన్ని మాస్క్ లు కూడా తయారు చేసాడు. ఇక ఎన్టీఆర్ భయంకర మాస్క్ లు ఇంటర్నెట్ లో కూడా హల్చల్ చేసాయి. ఇక ఆ ఎన్టీఆర్ మాస్క్ చూసిన వారంతా ఎన్టీఆర్ జై పాత్రపై విపరీతమైన ఆసక్తిని పెంచేసుకున్నారు. అయితే అలాంటి విపరీతమైన మేకప్ తో ఉన్న ఎన్టీఆర్ మాత్రం జై లవ కుశ లో కనబడలేదు. అలాంటి ఉగ్రరూపం మాస్క్ లాగా ఎన్టీఆర్ ఎక్కడ కనబడలేదు. కేవలం ఎన్టీఆర్ జై పాత్ర కోసం తన ముఖంలోని హావభావాలతోనే జై ప్రత్యేకత చూపించాడు తప్ప.. మేకప్ పరంగా పెద్ద మార్పులేమీ కనబడలేదు. ఇక జై పాత్ర హెయిర్ స్టైల్ కొద్దిగా మార్చారు. లవ, కుశ కాస్ట్యూమ్స్ కంటే జై పాత్ర కాస్ట్యూమ్స్ అవీ డిఫరెంటుగా ఉండేలా చూసుకున్నారు.

మేకప్...గ్రాఫిక్స్ అవసరం లేకుండానే.....

అయితే హాలీవుడ్ నిపుణుడిని జై పాత్ర మేకప్ కోసం పిలిపించారు కదా ఎందుకు అని దర్శకుడు బాబీని ఒక ఇంటర్వ్యూ లో ప్రశ్న వెయ్యగా... దానికి బాబీ జై లవ కుశలోని మూడు పాత్రల మేకప్ వైవిధ్యంగా ఉండేలా చూడాలని హాలీవుడ్ నిపుణుడిని రప్పించిన మాట వాస్తవమే అని.. అలాగే ఇందుకోసం కొన్ని గ్రాఫిక్స్ కూడా ఉపయోగించాలనుకున్నామని.. కాకపోతే ఎన్టీఆర్ ఆ మేకప్, గ్రాఫిక్స్ అవసరం రాకుండా చేశాడని క్లారిటీ ఇచ్చేడు. సాంకేతికంగా కన్నా హావభావాలతోనే జై పాత్రలో ప్రత్యేకత చూపిద్దామని ఎన్టీఆర్ చెప్పాడని... ఎన్టీఆర్ చెప్పినట్టే జై పాత్రకి ఎన్టీఆర్ ప్రాణం పోసాడని.... ఎన్టీఆర్ లాంటి డెడికేషన్ ఉన్న వ్యక్తిని తానింతవరకు చూడలేదని.. ప్రతి దర్శకుడు చెప్పే మాటనే బాబీ కూడా చెప్పాడు.

Similar News