ఆ అనుమానం ఎందుకొచ్చిందో?

Update: 2017-10-05 16:00 GMT

బాలకృష్ణ కెరీర్ లో సూపర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం లక్ష్మి నరసింహ. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళంలో విక్రమ్ నటించిన సామీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది బాలకృష్ణ హీరోగా వచ్చిన లక్ష్మి నరసింహ చిత్రం. అప్పట్లో హరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ తమిళ్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే మళ్ళీ ఇప్పుడు తమిళంలో సామి సినిమా కి సీక్వెల్ ని స్టార్ట్ చేసాడు డైరెక్టర్ హరి. విక్రమ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఈ సామి 2 సినిమాని దర్శకుడు హరి మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్ళిపోయాడు.

తెలుగులో కూడానా.......

ఇప్పటివరకు ప్రయోగాలు చేసి చేసి సరైన హిట్ అందుకోలేకపోయిన హీరో విక్రమ్ చాలా కాలం తర్వాత సామి సీక్వెల్ ద్వారా కమర్షియల్ లైన్ లోకి వచ్చాడు. దర్శకుడు హరి కూడా తనకిష్టమైన సింగం సిరీస్ ని పక్కన పెట్టి ఇది మొదలుపెట్టాడు. అయితే అక్కడ తమిళంలో సామి 2 అలా మొదలైందో లేదో అప్పుడే సామి 2 రీమేక్ ని కూడా తెలుగులో మరోమారు బాలకృష్ణే నటించబోతున్నాడంటూ వార్తలొచ్చేస్తున్నాయి. మరి సామి పార్ట్ వన్ ని రీమేక్ చేసుకున్న బాలకృష్ణ ఈ సామి 2 ని తెలుగులో రీమేక్ చేస్తాడా లేదా అనే అనుమానం ఇప్పుడు అందరిలో మొదలైంది.

బాలయ్యతో రీమేక్ చేస్తేనే.....

అయితే సామి సినిమా వచ్చినప్పుడు తమిళ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఆ సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టాడు బాలకృష్ణ. ఇక ఇపుడు తాజా పరిస్థితుల్లో తమిళంలో విడుదలయ్యే ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేసేస్తున్నారు. అందులోను హీరో విక్రమ్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా ఆయన సినిమాలకు తెలుగులో మంచి క్రేజే ఉంది. ఇక వరుసగా ప్లాపులతో సతమతమవుతున్న విక్రమ్ కి ప్రెజెంట్ తెలుగు లో అస్సలు మార్కెట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సామి 2 ని తెలుగు లో డబ్ చేయడం కంటే కూడా బాలకృష్ణ తో రీమేక్ చేస్తేనే బెస్ట్ అని భావిస్తున్నారు నిర్మాతలు. మరి ఈ సీక్వెల్ కి బాలకృష్ణ ఓకే చెప్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Similar News