అస్సలు నాకా ఉద్దేశ్యం లేదంటుంది!!

Update: 2017-07-15 13:54 GMT

దర్శకుడు కె రాఘవేంద్ర రావు పై తాప్సి బాలీవుడ్ షోలో చేసిన కామెంట్స్ ఇక్కడ టాలీవుడ్ లో దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. తాప్సి తెలుగులో కేవలం గ్లామర్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని.... హీరోయిన్స్ అందాలతోనే సినిమాలు హిట్ కొడతారని భావనతో... కె రాఘవేంద్ర రావు గారు ఎపుడు హీరోయిన్స్ నాభి మీదే ఫోకస్ చేస్తారని, దాన్ని చూసి తాను టెన్షన్ పడినట్లు చెప్పి వెకిలి నవ్వులు నవ్వింది

అయితే ఇప్పుడు తాను రాఘవేంద్ర రావు గురించి తప్పుగా మాట్లాడలేదని... తాను చేసిన వ్యాఖ్యల దుమారానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది తాప్సీ. రాఘవేంద్ర రావు ని కించ పరచడం తన ఉద్దేశం కాదని, సినిమా మేకింగ్‌లో తన అనుభవాలను వివరించే క్రమంలో అలా చెప్పాల్సివచ్చిందని తాప్సీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తాప్సీ తాజా వివాదంపై తన వెర్షన్‌ని వినిపించింది. రాఘవేంద్రరావు టేకింగ్ స్టయిల్ మీద తాను చేసిన కామెంట్స్ మీద మీడియాలో ఏవేవో రాసేశారని.... దీంతో తాను భాద పడ్డానని...... తెలుగు ప్రేక్షకులు నొచ్చుకుని వుంటే క్షమాపణలు చెబుతున్నట్లు అందులో చెప్పుకొచ్చింది.

మరి తాప్సి ముందు అలా పెద్దాయన్ని కించపర్చడం ఎందుకు తర్వాత ఇలా నేనేం అనలేదని... నా ఉద్దేశ్యం అది కాదు అనడం ఎమన్నా అర్ధముందా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.

Similar News