అల్లు అర్జున్ మరో బిజినెస్

Update: 2017-10-16 07:00 GMT

ఇప్పుడు స్టార్స్ అంతా ఒక్క సినిమాల మీదే కాన్సంట్రేట్ చేయడంలేదు... సినిమాలతోపాటు ఇతర బిజినెస్ ల మీద కూడా కన్నేస్తున్నారు. హీరో హీరోయిన్స్ సినిమాలతో పాటే వ్యాపారాలను చక్కబెట్టేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ రాజకీయాలతోపాటే సినిమాలు చేస్తుంటే, నాగార్జున వంటివారు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా ప్రొడక్షన్ తోపాటు జిమ్, హోటల్ వ్యాపారంలో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు యంగ్ హీరోస్ రామ్ చరణ్, శర్వానంద్, రానా వంటివాళ్ళు సినిమాలతోపాటే ఇతర బిజినెస్ లలో దూసుకుపోతున్నారు. అయితే స్టార్స్ అంతా ప‌బ్బులు, క్ల‌బ్బులు, హోట‌ల్‌, బార్, జిమ్.. వంటి వ్యాపారాలతో దూసుకుపోతున్నారు.

రామ్ చరణ్ తన తండ్రి సినిమాలతో నిర్మాతగా మారడమే కాదు.. ట్రూజెట్ తో విమానయాన రంగంలోనూ దూసుకుపోతున్నాడు. అలాగే బాహుబలితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాయించిన ప్రభాస్ కూడా నెల్లూరు హైవే మీద మల్టిప్లెక్స్ థియేటర్స్ తోపాటు షాపింగ్ మాల్ బిజినెస్ లోకి దూకేసాడు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ మధ్యనే తన భార్యతోకలిసి హోటల్ రంగంలోకి దూకాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడట. ఇప్పటికే బన్నీ జూబ్లీహిల్స్ వంటి కాస్ట్లీప్రాంతంలో ఒక పబ్ ని నిర్వహిస్తున్నాడనే ప్రచారం ఉండనే ఉంది. అంతేకాకుండా ప్రో కబడ్డీ లీగ్స్ లో చెన్నై తలైవాస్.... కేరళ ఫుట్ బాల్ క్లబ్స్ వంటి వాటిలో కూడా బన్నీ భాగస్వామిగా వున్నాడు.

ఇక ఇప్పుడు తాజాగా బన్నీ ఒక కొత్త బిజినెస్సులోకి దిగుతున్నాడట. ఇప్పటి వరకు స్టార్స్ ఎవరు టచ్ చెయ్యని వ్యాపారంలోకి అల్లు అర్జున్ వెళుతున్నాడట. అల్లు అర్జున్ బేక‌రీ వ్యాపారం చేసేందుకు రెడీ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఆ బేకరీలో కాస్ట్లీ స్వీట్స్ ఉంటాయంటున్నారు. ఇక ఆ స్వీట్స్ అల్లాట‌ప్పా స్వీట్స్ కాదని.... ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్ స్వీట్స్‌ అని చెబుతున్నారు. ఇక ఆ బేకరీ పేరు కూడా కెనోలి కేఫ్ అని... ఇది కూడా అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ప్రారంభించ‌నున్నాడట. మరి సినిమా సెలెబ్రిటీస్ అంతా అక్కడ హాయిగా కూర్చుని కొత్త కొత్త స్వీట్స్ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తారన్నమాట.

Similar News