అల్లు అయాన్ కి ఆ డ్రెస్ ఇచ్చింది నేనే!!

Update: 2018-03-26 11:08 GMT

మెగాస్టార్ నుండి మెగా పవర్ స్టార్ దాకా సినిమాకో సిగ్నేచర్ పోజుతో అలరించడం అనే ట్రెండ్ ఉంది. లేటెస్ట్ గా రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో కూడా ఓ సిగ్నేచర్ పోజ్ వైరల్ గానే స్ప్రెడ్ అవుతోంది. చెక్స్ షర్ట్..గళ్ల లుంగీ..ఎర్ర బనియన్..చేతిలో తువ్వాలు.. వీటితో రామ్ చరణ్ ఇచ్చిన స్టిల్ బాగా మెప్పించింది.

సోషల్ మీడియాలో వైరల్.....

అయితే ఇదే స్టిల్ ను అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్.. అచ్చు చరణ్ లాగ డ్రెస్ వేసి చరణ్ ఎలా నుంచున్నాడో ఆలా అల్లు అయాన్ నుంచుని ఉన్న ఫొటోకు పోజ్ ఇచ్చాడు. ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వయంగా అల్లు అర్జున్ ఈ ఫోటోను పోస్ట్ చేసి మరీ.. 'రంగస్థలం' పాటలతో అయాన్ తన చెవులు హోరెత్తించేస్తున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఈ ఫోటో వెనుక మరిన్ని కబుర్లు లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో చరణ్ పంచుకున్నాడు.

అయాన్ కు గిఫ్ట్ గా.....

అల్లు అర్జున్.. చరణ్ కి ఫోన్ చేసి ఇంకా నావల్ల కాదు అయాన్ కి మీ ఇంటికి పంపిచేస్తున్నా 'రంగస్థలం' సాంగ్స్ తో నా చెవులు పగిలిపోతున్నాయి అని చెప్పాడంట. అందుకే అప్పుడు అయాన్ కోసం నేను వేసుకున్న డ్రెస్ లాంటిదే ఇంకోటి కుట్టించి అయాన్ కు గిఫ్ట్ ఇచ్చాను... అని డ్రెస్సు వెనుక కథ చెప్పాడు రాం చరణ్ తేజ్.

Similar News