అలా చేసివుంటే త్రివిక్రమ్ సేఫ్ అయ్యేవాడు

Update: 2018-01-13 10:15 GMT

ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ అనే పేరు గత రెండు వారాలుగా సినిమా ప్రేక్షకులకి బాగా అలవాటైన పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞ్యాతవాసి చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్ర కథనే అనువుగా మార్చుకున్నారని వచ్చిన టాక్ ఇందుకు కారణం. సినిమా విడుదల అనంతరం త్రివిక్రమ్ కూడా మాట దాట వేయలేని విధంగా కథా పరంగా వస్తున్న పొంతనలతో దొరికిపోయాడు. అయితే లార్గో వించ్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ కన్ను పడకముందే నలుగురైదుగురు దృష్టి పెట్టారు. వారిలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఒకరు.

గౌతమ్ మీనన్ చేసి ఉంటే..

కొంత కాలం క్రితం విజయ్ తో తాను చేయబోయే చిత్రానికి అధ్యాయం ఒండ్రు అనే టైటిల్ ఖరారు చేసి, ఫోటో షూట్ నిర్వహించి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు గౌతమ్ మీనన్. ఈ చిత్రానికి లార్గో వించ్ చిత్ర కథనే స్ఫూర్తిగా తీసుకుని ఎమోషనల్ యాక్షన్ ఫిలిం ప్లాన్ చేసుకున్నారు గౌతమ్. అనివార్య కారణాల చేత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ఆగిపోయింది. తరువాత ఇంత కాలానికి త్రివిక్రమ్ ఈ కథని తన కాలంలో నుంచే జార్చి వెండితెరపై ప్రెజెంట్ చేసి అవాసుపాలయ్యాడు. ఒకవేళ గౌతమ్ మీనన్ అనుకున్న విజయ్ తో చిత్రం పూర్తయి విడుదలై ఉంటే త్రివిక్రమ్ మర్చిపోలేని ఒక డిసాస్టర్ నుంచి తప్పించుకునేవాడేమో..

Similar News