అలా.. అల అదిరిందిగా..

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో అంటే ఫ్యాన్స్ కి పూనకాలే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల హిట్ తో ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాపై భీభత్సమైన [more]

Update: 2020-01-07 05:24 GMT

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో అంటే ఫ్యాన్స్ కి పూనకాలే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల హిట్ తో ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాపై భీభత్సమైన అంచనాలున్నాయి. ఇప్పటికే అల టీజర్ లో త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్, బన్నీ లుక్స్, బన్నీ మ్యానరిజం అన్ని అద్భుతంగా పనిచేయ్యగా.. ఇప్పుడు తాజాగా అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సెర్ట్ లో అల్లు ఫ్యామిలీ మధ్యన అల వైకుంఠపురములో ట్రైలర్ కూడా వచ్చేసింది. మరి అల వైకుంఠపురములో త్రివిక్రమ్ పంచ్ లు, అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ లుక్స్, తండ్రి అంటే కసి.. మ్యూజిక్ అన్ని అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి. మ్యూజికల్ కాన్సెర్ట్ ని అల టీం ఫ్యాన్స్ హంగామా అంగరంగ వైభవంగా జరిపిస్తుంది. టబు, అల్లు అర్జున్, శిరీష్, అల్లు అరవింద్, వైఫ్, అల్లు బాబీ, నివేత పేతురేజ్, త్రివిక్రమ్, సునీల్ ఇలా అల వైకుంఠపురములో కాన్సెర్ట్ ఒక ఎత్తైతే… అక్కడ విడుదల చేసిన అల ట్రైలర్ ఒక ఎత్తు.

అల ట్రైలర్ లో పక్క ఫ్యామిలీ ఎమోషన్స్‌కు తోడు కామెడీ.. దానికి కావాల్సిన యాక్షన్ కూడా మిక్స్ చేసాడు త్రివిక్రమ్. మాస్‌కు కూడా ఈ చిత్రంలో కావాల్సినంత మసాలా ఉందని ఈ ట్రైలర్‌తోనే చూపించేసాడు. అల్లు అర్జున్, మేడం పూజ హెగ్డే ని చూపిస్తూ బ్రహ్మాజీతో చెప్పే ఈ భూమ్మీద పుట్టించే హక్కు ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకు.. రెండు వీళ్లకు అనే డైలాగ్ మాత్రం అదిరింది అనే చెప్పాలి. ఇంకా చరిత్రలో గొప్పగొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే జరుగుతాయంటూ వచ్చే డైలాగ్ కూడా ఎమోషనల్ గా హత్తుకుంది.

ఇక టబు అందం, పాత్రలోని గంభీరం ఆకట్టుకోగా.. అడుగడుగునా అల్లు అర్జున్ లుక్స్, పంచ్ కామెడీ అదరగోట్టాయి. త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్.. అల్లు అర్జున్ కామెడీ, మ్యానరిజం అబ్బో ఎంత చెప్పుకున్న తక్కువే. పూజ హెగ్డే గ్లామర్, స్టైలిష్ యాక్షన్, సుశాంత్ అమాయకపు పాత్ర, అజయ్ భీబత్సమైన పాత్ర, సచిన్ ఖేడ్కర్ అల్లరి, మురళి శర్మ మిడిల్ క్లాస్ లుక్, అండ్ కేరెక్టర్, సముద్రఖని విలనిజం, అన్ని త్రివిక్రమ్ మార్క్ స్పెషల్ గా కనబడుతున్నాయి. ఇక థమన్ హిట్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటుగా సినెమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. మరి అల వైకుంఠపురములో సంక్రాతి పుంజులకు చుక్కలే.. కాచుకోండి అంటూ అల్లు అర్జున్ చేతిలో పందెం కోడి… అబ్బో ట్రైలర్ లో ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అనేలా లేవు.. అన్ని సమానమైన పాళ్లల్లో ఉంది ఈ ట్రైలర్.

Tags:    

Similar News