అయ్యో విడుదల కష్టమే అంటున్నారు!!

Update: 2017-06-19 11:25 GMT

గత ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుని ఫైనాన్స్ ఒడిదుడుకులు తట్టుకుని ఎట్టకేలకు జూన్ 9 న సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పిన గోపిచంద్ 'ఆరడుగుల బుల్లెట్' నిర్మాతలు... ఇప్పుడు చడీ చప్పుడు చెయ్యడం లేదు. అసలు 9 ఉదయం వరకు సినిమా విడుదల ఉందన్నారు... కానీ మార్నింగ్ షో పడే టైం కి సినిమా విడుదల ఆపేసారు. కారణం ఈ సినిమాకు 6 కోట్ల ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్షియర్ తన డబ్బులు ఇచ్చి సినిమా విడుదల చేసుకోమంటూ కేసు పెట్టాడు. ఇంకేముంది షో పడలేదు. సినిమా విడుదల ఆగిపోయింది.

ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా మూలనపడ్డ 'ఆరడుగుల బుల్లెట్టు'కి పొట్లూరి వరప్రసాద్ ఓ 10 కోట్ల దాకా సాయం చేయడంతో విడుదలకు మోక్షం వచ్చిందికదా అనుకుంటే మళ్ళీ ఇలా జరిగింది. ఇప్పటికే నిర్మాతలు అప్పుల్లో మునిగిపోనున్నారు. ఇక ఈ సినిమాకు మోక్షం లేనట్లే అని చెబుతున్నారు. అసలు ఈ సినిమాకున్న సమస్యల పరిష్కారానికి నిర్మాతలు ముందడుగు వెయ్యడం లేదని.... ఈ సినిమాపై నిర్మాత పెట్టిన పెట్టుబడిని వదులుకునే పరిస్థితిలో ఉన్నారని.... ఒకవేళ సినిమా విడుదలై ఎమన్నా వచ్చినా అవి కాస్తా... పివిపి అకౌంట్ లోకి వెళ్లిపోవడం ఖాయం గనక ఈ సినిమాపై ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియర్ కి ఇంకో 6 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు.... కాబట్టి నిర్మాతలు ఈ సినిమా విడుదల కాకపోయినా నష్టం లేదనుకుంటున్నారని అంటున్నారు.

అసలు సినిమా రిలీజ్ అయినా పివిపి కి 10 కోట్లు,ఫైనాన్షియర్ కి 6 కోట్లు ఈ సినిమా వసూలు చేయడమనేది సాధ్యం కాదని... అందుకే ఈ వివాదాలు సెటిలై ఇప్పుడిప్పుడే సినిమా విడుదల కావడం అన్నది కష్టమే అంటున్నారు.

Similar News