అమ్మో అదరగొట్టేసాడు!!

Update: 2017-01-26 17:21 GMT

'బాహుబలి 1 'చిత్రంతో తెలుగు చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి మరోసారి 'బాహుబలి పార్ట్ 2 ' తో ప్రేక్షకులను కనువిందు చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. వచ్చే ఏప్రిల్ లో ప్రభంజనం సృష్టించడానికి వస్తున్న 'బాహుబలి పార్ట్ 2 ' తో అపుడే పబ్లిసిటీ ని మొదలెట్టేసాడు రాజమౌళి. ఆ పబ్లిసిటీలో భాగంగా ఈ రోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో 'బాహుబలి 2 ' పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లోహీరో ప్రభాస్, అనుష్క దివినుండి భువికి దిగివచ్చిన దేవతామూర్తుల్లా వెలిగిపోతున్నారు ఇద్దరూ. ఇక ఈ పోస్టర్ తో బాహుబలి మళ్ళీ తన రికార్డులను తానె తిరగరాసేందుకు సిద్ధమైనదని అర్ధమైపోతుంది.

'బాహుబలి పార్ట్ 1 'వచ్చి అప్పుడే ఏడాదిన్నర కావొస్తున్నా బాహుబలి పై అంచనాలు అలాగే వున్నాయి. గత రెండున్నరేళ్లుగా రాజమౌళి ఫ్యామిలీతో పాటే హీరో ప్రభాస్ కూడా తమ సమయాన్ని బాహుబలికి వెచ్చించారు. ఆ కష్టానికి ప్రతి ఫలం వీరికి పూర్తిగా దక్కడానికి మరెంతో సమయం లేదు అన్నట్లు కనబడుతుంది ఈ 'బాహుబలి' పోస్టర్. ప్రభాస్, అనుష్క ఇద్దరు కలిసి విల్లు ఎక్కుపెట్టిన ఈ పోస్టర్ చూస్తుంటే ప్రభాస్ అభిమానులకే కాదు అందరికి పిచ్చెక్కిపోతుంది. అసలు రాజమౌళి స్టామినా గురించి వేరే చెప్పకర్లేదు. తెలుగువారు గర్వపడేలా చిత్రాలను తెరకెకెక్కించడంలో రాజమౌళికి సాటిలేరని మరొక్కసారి రుజువు చేసే ఈ పోస్టర్ చూస్తుంటే 'బాహుబలి' చిత్రం విడుదలయ్యే వరకు ఏమాత్రం ఓపిక పెట్టేలా లేరు సినీ ప్రేమికులు.

Similar News