అమ్మడు కోరిక కొద్దిగా పెద్దదే

Update: 2017-10-03 03:28 GMT

అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో గ్లామర్ షో తో పిచ్చెక్కించింది పూజా హెగ్డే. డీజే తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే.... ఇప్పుడు తన మనసులో ఉన్న ఓ వింత కోరికను బయటపెట్టింది. తనకి ఒక డ్రీమ్ ఉందని..... అయితే ఆ డ్రీమ్ ఏంటనే విషయాన్ని రివీల్ చేసింది. పూజా హెగ్డే కోరిక ఏంటో వింటే మీరు కూడా కాస్త షాక్ అవుతారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషలను దున్నేయాలని....అలాగే ఒకేసారి క్రేజ్ తెచ్చుకోవాలనే పిచ్చి కోరిక ఉందట పూజా హెగ్డేకు.

మరి పూజ కున్న కల పెద్ద పగటి కల కాదు. ఎందుకంటే కాస్త గట్టిగా ట్రైచేస్తే ఇది సాధ్యమయ్యేదే. కాకపోతే తెలుగులో చేసిన ఒకే ఒక్క క్రేజీ ప్రాజెక్టుకే పూజా ఇలాంటి కోరిక బయటపెట్టడం మాత్రం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ అయిన అనుష్క, సమంత, శృతిహాసన్, తమన్న, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లకే ఇప్పటివరకు సాధ్యం కాని ఫీట్ ఇది. ఎందుకంటే ఈ హీరోయిన్లంతా ఒక భాషలో హిట్ తెచ్చుకుంటే మరో భాష లో ఫ్లాప్ భామలుగానే మిగిలిపోయారు. మరీ ముఖ్యంగా పూజా హెగ్డే కి బాగా వర్తిస్తుంది. ఈ భామ బాలీవుడ్ లో సక్సెస్ అందుకోలేక చతికిల పడింది.

మరి పూజకున్న డ్రీమ్ ప్రకారం... అంటే బాలీవుడ్ లో ఓ బంపర్ హిట్ అందుకుంటూనే… సేమ్ టైం తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్లు కొట్టాలన్నమాట. అలాంటి క్రేజీ స్టేటస్ ను ఎంజాయ్ చేయాలని ఉందని పూజా తాజాగా చెప్పుకొచ్చింది. మరి పూజ కల బాగానే వుంది కానీ అది వర్కౌట్ అయ్యే అదృష్టం ప్రస్తుతానికి పూజకి లేదు అంటున్నారు జనాలు. చూద్దాం పూజకి లక్కు ఎలా ఉందొ....!

Similar News