అమ్మడు ఆగడం లేదు

Update: 2017-10-13 06:26 GMT

అర్జున్ రెడ్డి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి విషయం ఒక క్లారిటీ లేదుగాని అందులో నటించిన హీరోహీరోయిన్స్ కి మాత్రం బోలెడు క్రేజ్ తోపాటు అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. సందీప్ కి అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో అవకాశాలొస్తున్నాయంటున్నారు కాని ఎక్కడ క్లారిటీ న్యూస్ మాత్రం లేదు. కానీ హీరో విజయ్ మాత్రం బయట క్రేజీ హీరోగా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరో పక్క అర్జున్ రెడ్డి లో విజయ్ సరసన నటించిన షాలిని పాండే కూడా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.

ఇప్పటికే షాలిని తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ అయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానటి సినిమా లో వన్ అఫ్ ది లీడ్ రోల్ ని పోషిస్తుంది. ఈ సినిమా లో సమంతా, కీర్తీ సురేష్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది షాలిని పాండే. ఇదిలా ఉంటే అటు తమిళంలో కూడా క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 100 % కాదల్ లో కూడా షాలిని పాండేని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. తెలుగు లో వచ్చిన 100 % లవ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జీవి ప్రకాశ్ కుమార్ హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా అధికారికంగా సెట్స్ మీదకెళ్లింది కూడా.

ఇకపోతే ఈ లక్కీ భామకి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందట..అదేంటంటే మలయాళంలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన దుల్కర్ సల్మాన్ సరసన షాలిని నటించబోతుందని ప్రచారం మొదలైంది. దుల్కర్ సల్మాన్ ఓకే బంగారం సినిమాతో తమిళ, తెలుగు భాషల్లోనూ మంచి పేరు సంపాదించాడు. అదే తరహాలో ఇప్పుడతను తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడట. ఆర్ ఏ కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో దుల్కర్ కి జోడిగా షాలిని పాండేని లీడ్ రోల్ లో తీసుకున్నారట. మరి ఈ అవకాశంతో షాలిని అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు మళయాళ ఇండస్ట్రీని కూడా ఏలడానికి రెడీ అయ్యిందన్నమాట. ఒక్క చిత్రం ఈ హీరోయిన్ ఫెట్ ఎలా మార్చేసిందో చూశారూ.

Similar News