అమితాబ్ బచ్చన్ కాదంటే కృష్ణం రాజే

Update: 2017-01-23 19:30 GMT

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ యవ్వన దశ నుంచి హీరోగా సాధించినన్ని విజయాలు వృద్దాప్యంలో ఆయన ఎంచుకుంటున్న వరుస వైవిధ్యమైన పాత్రలతో కూడా సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. బిగ్ బి 74 సంవత్సరాల వయసులో కూడా నిర్విరామంగా నటిస్తూ, కొన్ని చిత్రాలలో అయితే ఏకంగా పూర్తి భాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని మరీ నడిపిస్తున్నారు. ప్రస్తుతం హిందీ లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సర్కార్ 3 చిత్రీకరణలో వున్న అమితాబ్ బచ్చన్ కి కొద్ది రోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక మన్నన వెళ్ళింది. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశి తాను నట సింహం నందమూరి బాల కృష్ణ తో చేయబోయే తదుపరి చిత్రం రైతు లో ఒక కీలక పాత్ర పోషించటం కోసం దర్శకుడు కృష్ణ వంశి, నందమూరి బాల కృష్ణ లు ఇద్దరు సర్కార్ 3 సెట్స్ లోనే బిగ్ బి ని కలిసి కోరగా ఆయన సర్కార్ 3 పూర్తయిన అనంతరం తన నిర్ణయాన్ని చెప్తానని పెండింగ్లో ఉంచారు.

ప్రస్తుతం నక్షత్రం సినిమాని తెరకెక్కిస్తున్న కృష్ణ వంశి ఆ చిత్రీకరణని దాదాపుగా తుది దశకు తీసుకు వచ్చారు. మరో నెల రోజులలో సినిమా విడుదల తేదీ కూడా ఖరారు కానుంది. అప్పటికి బిగ్ బి తన నిర్ణయం చెప్తూ ఒకవేళ రైతు లో నటించటానికి ఒప్పుకుంటే ఆ చిత్రం వెంటనే పట్టాలెక్కుతోంది. లేక ఆయన ఈ పాత్రలో కనిపించటానికి విముఖత తెలిపితే కృష్ణ వంశి మరో ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుంటున్నారు. అమితాబ్ అంగీకరించని తరుణంలో ఆ పాత్రని రెబెల్ స్టార్ కృష్ణం రాజు తో చేపించాలని కృష్ణ వంశి యోచన. అయితే శ్రీరామా రాజ్యం లో నయనతార నటించనిదే ఆ చిత్రం ఉండేది కాదని అలానే తాజాగా గౌతమీ మాత పాత్రలో హేమా మాలిని నటించకపోతే గౌతమీపుత్ర శాతకర్ణి ఉండేది కాదని చెప్పినట్టే అమితాబ్ జి ఒప్పుకోకపోతే రైతు చిత్రం ఉండదని ఇప్పటికే వ్యాఖ్యానించారు. మరి కృష్ణం రాజుతో చెఇంచాల్సి వస్తే బాలయ్య ని కన్విన్స్ చేయటం కృష్ణ వంశి కి మరో పెద్ద టాస్క్ అవుతుంది.

గతంలో అమృత వర్షం మరియు మనం చిత్రాలతో తెలుగులో అతిధి పాత్రలలో మెరిసిన అమితాబ్ బచ్చన్ ఇప్పుడు రైతు చిత్రంలో నటించటానికి అంగీకారం తెలుపుతారో లేదో చూడాలి.

Similar News