అభిమానులకి సూపర్ స్టార్ చేసుకున్న సున్నితమైన విన్నపం

Update: 2017-03-31 07:37 GMT

గత ఏడాది మే నెల 20 న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గత చిత్రం బ్రహ్మోత్సవం విడుదలైయ్యింది. ఒక స్టార్ హీరో చిత్రం ఆడితే తదుపరి చిత్రంపై ఏర్పడే అంచనాలు అభిమానులని ఓపికగా ఎదురు చూడటానికి సహకరిస్తుంటాయి. కానీ అగ్ర హీరోల చిత్రం ఒకటి ఆడకపోతే ఆ హీరో అభిమానులకి వీలైనంత త్వరగా వారి ఆకలి, దాహాలను తీరిస్తేనే వారి మనసులు కుదటపడతాయి. అయితే బ్రహ్మోత్సవం వచ్చి విఫలమై మరో నెలన్నర కి ఏడాది పూర్తవుతుంది. కానీ మహేష్ బాబు నటిస్తున్న తదుపరి చిత్రం విడుదలకి ఇప్పటికి నోచుకోకపోగా దాదాపు ఎనిమిది నెలల క్రితమే చిత్రీకరణ ప్రారంభం చేసుకున్న మురగదాస్ చిత్రం ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ కానీ, లోగో కానీ విడుదల కాకపోగా ఇప్పటివరకు అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి కానీ ఒక్క టైటిల్ కూడా ఖరారు చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక అనేక వాయిదాల అనంతరం ఉగాది పండుగకి ఫస్ట్ లుక్ విడుదల ఖాయం అని అభిమానులని ఊరించిన తరువాత మళ్లీ వాయిదా వేయడంతో సహనం కోల్పోయిన సూపర్ స్టార్ అభిమానులు వారి ఆగ్రహాన్ని దర్శకుడు ఏ.ఆర్.మురగదాస్ పై సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. ఈ వేడి మహేష్ బాబు ని సైతం తాకుతుండటంతో ఇంతకాలం మౌనంగా వున్న మహేష్ తన అభిమానులని శాంత పరచటానికి వారిని ఉద్దేశించి ట్వీట్ చేసాడు. అతి త్వరలో వారి ఎదురు చూపులు ఫలిస్తాయి అంటూ ట్వీట్ చేసేదే తప్ప తన ట్వీట్లో కూడా టైటిల్ ప్రస్తావించకుండా మహేష్ 23 అంటూ ట్వీట్ చేసాడు.

To all my dearest fans, I know you have been eagerly waiting for the first look of #Mahesh23. Our team is shooting day & night for the film.

The first look will be out very soon...Requesting you all to be a little patient. Love you guys as always :)

Similar News