అభిమానుల కోసం వెనక్కి తగ్గాడా?

Update: 2017-10-16 06:00 GMT

బాలకృష్ణ హీరోగా పూరి దర్శకత్వంలో పైసా వసూల్ చిత్ర టైటిల్ ని ప్రకటించినప్పుడు ఇదేం టైటిల్.. బాలయ్యకి అస్సలు సూట్ కాదంటూ నందమూరి అభిమానులు పెదవి విరిచారు. అయినా పైసా వసూల్ సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదల సమయానికి బాలకృష్ణ పైసా వసూల్ టైటిల్ అభిమానుల నోళ్లలో నానీ నాని మంచి క్రేజ్ సంపాదించింది. ఇక సినిమా ఫలితం అనేది ప్రేక్షకుల నాడి మీద ఆధారపడివుంటుంది అది వేరే విషయం. అయితే ఇప్పుడు కూడా బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రానికి కర్ణ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

అయితే ఈ కర్ణ టైటిల్ బాలకృష్ణ కి సూట్ కాదని... నందమూరి అభిమానులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారని ప్రచారంలో ఉంది. కర్ణ అనే టైటిల్ చప్పగా ఉందని... సింహ సెంటిమెంట్ తో వచ్చిన టైటిల్స్ తో బాలయ్య హిట్స్ కొడుతున్నాడని... అందుకే రవికుమార్ - బాలయ్య చిత్రానికి ముందు అనుకున్నట్టుగా జయసింహ అనే టైటిల్ నే ఫిక్స్ చెయ్యమని... బాలయ్య బాబుని బతిమాలాడుతున్నారట. మరి కర్ణ అనే టైటిల్ కన్నా జయసింహ టైటిలే బావుందని చాలామంది చెప్పడంతో బాలకృష్ణ తో పాటు దర్శకుడు రవికుమార్ కూడా కర్ణ టైటిల్ మీద వెనక్కి తగ్గే సూచనలు కనుబతున్నాయంటున్నారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార నటిస్తుండగా మరొక ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Similar News