అభిమాని ఆహ్వానాన్ని మన్నించిన తార

Update: 2017-02-21 08:28 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో పలు చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకున్నప్పటికీ అన్నీ కమర్షియల్ సినిమా అవకాశాలే కావటంతో విసుగు చెంది తన మాకం ని బొంబాయి కి మార్చిన తాప్సి పన్ను ఇప్పుడు వరుసగా వైవిధ్యమైన పాత్రలలో కనిపిస్తూ బాలీవుడ్ సినిమా క్రేజ్ తో యావత్ భారత దేశంలో పాపులర్ అయిపోయింది. ఛాష్మీ బద్దూర్ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమై ఆ చిత్రంతో ఫిమేల్ డెబ్యూ విభాగంలో ఫిలింఫేర్ కి నామినేట్ ఐన తాప్సి తన రెండవ హిందీ చిత్రం బేబీ లో తక్కువ నిడివి కలిగిన పాత్ర పోషించినప్పటికీ షబానా కైఫ్ పాత్రలో కనిపించినంత సేపు షో స్టీలర్ గా నిలిచి ప్రేక్షకులకు షబానా గా రిజిస్టర్ అయిపోయింది. అనంతరం పింక్ చిత్రంతో ఏకంగా బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం గెలుచుకుని ఆ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకుంది. పింక్ చిత్ర విజయంతో తాప్సి వరుస హిందీ సినిమాలు అంగీకరిస్తూ సైనింగ్ స్ప్రీ ఆఫ్ బాలీవుడ్ గా మారిపోయింది.

గత వారంలో ఒకేరోజున తాప్సి నటించిన రెండు హిందీ సినిమాలు రన్నింగ్ షాదీ, ది ఘాజి ఎటాక్ చిత్రాలు విడుదల కాగా ఘాజి సూపర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తుండగా, రన్నింగ్ షాదీ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో కన్సిస్టెంట్ కలెక్షన్స్ సాధించగలుగుతుంది. పంజాబీ మిక్స్ తో వున్న హిందీ భాష కారణంగా తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ లలో రన్నింగ్ షాదీ జోరు కనిపించటం లేదు. అయినప్పటికీ నామ్ షబానా ప్రచార చిత్రంతో తాప్సి పన్ను పేరు అందరి నోర్లలో నానుతూనే వుంది. ప్రస్తుతం నామ్ షబానా విడుదలకు సిద్ధం కాగా, తడ్కా, జద్వా 2 చిత్రాల చిత్రీకరణాలల్లో తీరిక లేకుండా గడుపుతున్న తాప్సి వీలు కలిపించుకుని మరీ మార్చిలో సికింద్రాబాద్ లో జరగనున్న ఒక వివాహానికి హాజరు కాబోతోంది. ఇది ఏ సెలబ్రిటీ ఇంట వివాహ వేడుక అయితే మనం ప్రత్యేకించి చెప్పుకునే పని ఏముంటుంది? తాప్సి హాజరు కాబోతోన్న వివాహం సికింద్రాబాద్ లో నివాసముండే తన వీరాభిమాని వివాహం. తాప్సి కెరీర్ ఝమ్మంది నాదంతో మొదలు ఐన నాటినుంచి ఈ అభిమాని తరచు తాప్సి ని ఈమెయిల్స్ ద్వారా పలకరిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటూ, తాప్సి ప్రతిభకి ప్రశంసలతోపాటు, లోపాలను కూడా ఎత్తి చూపేవాడట. ఇంత కాలం తమ మధ్య ఒక సెలబ్రిటీ-ఫ్యాన్ రిలేషన్ ఈమెయిల్స్ ద్వారా నిత్యం నడుస్తున్నా ఎటువంటి ఇబ్బంది కలగనివ్వని అభిమాని అంటూ తాప్సి కూడా అతగాడికి కితాబిచ్చింది. తాను మెచ్చిన అభిమాని వివాహ ఆహ్వానం పంపటంతో బొంబాయి లోని బిజీ షెడ్యూల్స్ నుంచి ఒక రోజు సెలవు తీసుకుని మరీ సికింద్రాబాద్ రావటానికి ఫిక్స్ ఐయ్యింది తాప్సి పన్ను.

Similar News