అబ్బో మెగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కడం ఖాయం!!

Update: 2017-02-04 11:16 GMT

ఎప్పుడెప్పుడు పవన్ 'కాటమరాయుడు' టీజర్ చూద్దామా.. అని ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ నిరీక్షణ ఫలించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' టీజర్ తో వచ్చేసాడు. 'కాటమరాయుడు' గురించి ఇప్పటిదాకా వినబడిన గాసిప్స్ అన్నిటికీ ఒకా టీజర్ తోనే చెక్ పెట్టేసాడు పవన్. ఉన్న అనుమానాలన్నీ ఒక్క టీజర్ తో ఎగిరిపోయాయి. ఇప్పటిదాకా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు సైలెంట్ గా కుమ్మడానికి వచ్చేసాడు పవన్. డాలి డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' లో అసలు పవన్ ఎలా ఉంటాడో అని అందరూ ఎదురు చూస్తున్న టైములో పంచె కట్టు తో ఫస్ట్ లుక్ వదిలి టీజర్ అతి త్వరలోనే అంటూ ఊరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు పవన్ ని రాయుడు లుక్ లో ఫస్ట్ లుక్ టీజర్ లో చూపించి అరిపించేసారు.

ఇక 'కాటమరాయుడు' టీజర్ 'రాయుడా... అంటూ సాంగ్ తో మొదలై పవన్ డాన్స్ తో పిచ్చేక్కిన్చేసి.... ఫైట్ సీన్ తో ఇరగదీసిన పవన్ ,ఎంతమందున్నరన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడన్నదిముఖ్యం, అంటూ చెప్పే డైలాగ్ తో థియేటర్స్ బద్దలయిపోయేలా వుంది. అసలు పవన్ అలా పంచె కట్టుతో కూర్చునే సీన్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా ప్రేక్షకుడు కూడా కుర్చీ లోనుండి లేచి ఈల వెయ్యడం గ్యారెంటీ అనిపించేలా ఉందా సీన్. ఇక పూర్తి యాక్షన్ తో నింపేశారు 'కాటమరాయుడు' టీజర్ మొత్తాన్ని. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనూప్ రూబెన్స్ అరిపిన్చేసాడు. అదరహో అనిపించేలా మ్యూజిక్ అందించాడని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ టీజర్ లో హీరోయిన్ శృతి హాసన్ ని మాత్రం చూపించకుండా హైప్ క్రియేట్ చేశారు.

ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం 'కాటమరాయుడు' టీజర్ తోనే పవన్ మాకు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చాడని ఫీల్ అవుతున్నారు.

Similar News