అబ్బో ఏం ప్లాన్ చేసాడు!

Update: 2016-11-03 14:46 GMT

ఇక ఈ రెండు నెలలూ సినిమాల ఆడియో ఫంక్షన్ తో తెగ హడావిడి చేసే నెలలు. వచ్చే డిసెంబర్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఈ నవంబర్ నెలలోనే ఆడియోలు జరుపుకుంటాయి. ఇక వచ్చే సంక్రాంతి కి విడుదల సినిమాలన్నీ వచ్చే డిసెంబర్ లోనే ఆడియో వేడుకలు జరుపుకుంటాయి. ఇక వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధ్రువ చిత్రం ఈనెలలో ఆడియోకి రెడీ అయ్యింది. ఇక ఈ ఆడియో వేడుకని హైద్రాబాద్లో నవంబర్ 9న అంగరంగ వైభవం గా చెయ్యాలని మొదట భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ ఆడియో వేడుక అతిధుల సమక్షం లో కాకుండా డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చెయ్యాలని భవిస్తున్నారట. ఇక ఈవార్త తో మెగా అభిమానులు ఒకింత షాక్ కి గురైయ్యారని అంటున్నారు. అసలు ఈ ధ్రువ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరవుతాడని అన్నారు. కానీ పవన్ రానని చెప్పాడేమో .... అందుకే ఏకంగా ఇప్పుడు ఈ ఆడియో వేడుకని క్యాన్సిల్ చేసేశారని వార్తలు మొదలయ్యాయి.

ఇక ఈ వార్తలకు స్పందించిన చరణ్ వెంటనే తేరుకుని తన సన్నిహితులతో పవన్ రాకపోవడం వల్ల ఈ ఆడియో ఫంక్షన్ రద్దుకాలేదని.... వచ్చే డిసెంబర్ లో సినిమా రిలీజ్ అవ్వడానికి టైం దగ్గర పడడం... ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని... చెప్పించాడని సమాచారం. ఇక ఆడియో వేడుక ఘనంగా చెయ్యకపోయినా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని మాత్రం విజయవాడలో గ్రాండ్ గా జరిపిస్తామని చరణ్ మెగా ఫాన్స్ కి మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫంక్షన్ కైనా పవన్ హాజరవుతాడా... లేక మళ్ళీ హ్యాండ్ ఇస్తాడో కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

Similar News