అబ్బ సాహో అదరగొట్టేసాడు!

Update: 2018-05-02 08:35 GMT

బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప్రభాస్ చేస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్రం కొన్ని రోజులు కిందటివరకు చాలా స్లో గా షూటింగ్ జరిగింది. కానీ గత కొన్ని రోజులు నుండి ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో , అబుదాబిలో శరవేగంగా సాగుతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ కు 19వ చిత్రం కాగా, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ స్టిల్స్ ను ప్రభాస్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

ఆ పిక్స్ లో ఓ హైఎండ్ స్పోర్ట్స్ బైక్ పై కూర్చుని ఉన్న ప్రభాస్ స్టయిలిష్ గా, డేరింగ్ గా కనిపిస్తున్నాడు. బాహబలితో భారీగా శరీరాన్ని పెంచిన ప్రభాస్ సాహో కోసం బాగా తగ్గాడు. అయితే అతని స్టైల్ మాత్రం మార్పేమీ రాలేదు. అయితే సాహో సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ పై ప్రభాస్ స్టైల్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నిజంగా ప్రభాస్ ఆ పిక్స్ లో అదరగొడుతున్నాడు. మరి డైరెక్టర్ సుజీత్ ఈ యంగ్ రెబెల్ స్టార్ ని పోలీస్ గా ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుస్తున్నారు.

ఇక ప్రభాస్ కి జోడిగా శ్రద్ధ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Similar News