అప్పుడు నమ్మకం లేదుగాని.... మరి ఇప్పుడు!!

Update: 2017-06-18 07:01 GMT

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనే కంటే... స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ అనడం బావుంటుందేమో.. ఆయన కథలతోనే రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్ గా ఎదిగాడు అనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఇక విజయేంద్ర ప్రసాద్ పేరు ఇప్పుడు బాలీవుడ్ లోనూ మార్మోగిపోతోంది. పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ కి 'భజరంగి భాయీజాన్' వంటి స్టోరీ ఇచ్చి హెల్ప్ చేసాడు. ఆ సినిమాతో సల్మాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన 'భజరంగి భాయిజాన్' చిత్రం 600 కోట్ల పైబడే కాసుల వర్షం కురిపించింది.

అయితే ఈ 'భజరంగి భాయిజాన్' కథని అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ మన టాలీవుడ్ యంగ్ హీరోకి వినిపించాడని వార్తలొచ్చాయి. స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ కే విజ‌యేంద్ర ప్ర‌సాద్ తొలుత ఈ స్టోరీను వినిపించాడట. కానీ అప్పుడు అల్లు అర్జున్ ఆ క‌థ‌ను రిజ‌క్ట్ చేశాడని ప్రచారం జరిగింది. ఆ కేరెక్టర్ కి తాను సూట్ కానని.... ఆ కథని తెలుగులో పెద్దగా ఆదరించరని చెప్పాడట. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ విజేంద్ర ప్రసాద్ రాసిన కథతో ఒక సినిమా చెయ్యాలని ఆశపడుతున్నట్లు ప్రచారం మొదలైంది. 'డీజే' సినిమా విడుదల తర్వాత వక్కంతం వంశి డైరెక్షన్ లో నటిస్తున్న బన్నీ ఈసారి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ తన దగ్గరికి వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోడని అంటున్నారు.

మరి ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కథలతో తెరకెక్కుతున్న చిత్రాలు హిట్ అవుతున్నాయనేగా బన్నీ ఆయన కథ కోసం వెంపర్లాడుతున్నాడు. లేదంటే మనోడు అటువైపు తొంగికూడా చూడడు. మరి అసలు విజయేంద్ర ప్రసాద్ కూడా బన్నీని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తాడో లేదో మాత్రం ప్రస్తుతానికి కాస్త సస్పెన్స్.

Similar News