అప్పట్లో మెగాస్టార్ ఇప్పుడు స్టైలిష్ స్టార్

Update: 2016-11-14 11:32 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండి తెరకు పరిచయం కావటానికి గీతా ఆర్ట్స్ పలుకుబడి, మెగా స్టార్ చిరంజీవి అభిమానుల అండ ఉపయోగపడ్డాయి కానీ అతను స్టైలిష్ స్టార్ గా, మంచి నటుడుగా, కమర్షియల్ చిత్రాలతో పాటు అభిరుచి గలిగిన కథలను ఎంచుకునే యువ నటుడిగా, తెలుగు రాష్ట్రాలతో పాటు మళయాళ భాషలోనూ సమాంతర మార్కెట్ సంపాదించుకోగలటం లాంటివి అన్ని అల్లు అర్జున్ ప్రతిభకి నిదర్శనం. అల్లు అర్జున్ స్టయిలిష్‌గా , మోడరన్ గా కనిపిస్తూకూడా మాస్ ప్రేక్షకులని అలరించగలరు. అందుకే ఆయన ఆర్య వంటి వైవిధ్యమైన ప్రేమ కథ చిత్రం, పరుగు వంటి కుటుంబ కథా చిత్రం, వేదం వంటి ప్రయోజనాత్మక చిత్రం, రుద్రమదేవి వంటి చారిత్రాత్మక చిత్రం, దేశముదురు, సరైనోడు వంటి మాస్ మసాలా చిత్రాలు ఇలా అన్ని రకాల చిత్రాల తో ప్రేక్షకులను మెప్పిస్తూ మెగా అభిమానులను ఆనందపరుస్తున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ బ్రాహ్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. చాలా కాలం క్రితం మెగా స్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో బ్రాహ్మణుడి పాత్రలో కనిపించారు. ఆ తరువాత మరే మెగా హీరో అటువంటి పాత్ర పోషించలేదు. అందుకే అల్లు అర్జున్ నటనని చిరు నటనతో పోల్చుకునే ప్రమాదం వుంది అని పసిగట్టి ఆ పాత్ర చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంట దర్శకుడు హరీష్ శంకర్. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చిత్రీకరణ జరుగుతుంది.

Similar News