అన్న ని మోసం చేశాడా?

Update: 2018-03-30 07:20 GMT

నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది. కానీ తండ్రి మాట కోసం కళ్యాణ్ రామ్ తన తమ్ముడిని కలుపుకు పోతూనే మిగతా నందమూరి ఫ్యామిలీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంతో అనుబంధంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అన్న కోసం తమ్ముడు సినిమా చెయ్యడం, తమ్ముడు కోసం అన్న కష్టపడడం ఇలా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల మధ్యన అనుబంధం పెరుగుతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు అన్నని మోసం చేశాడా? ఎందుకంటే ఎమ్యెల్యే ప్రమోషనల్ ఈవెంట్ కోసం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ని పిలవగా త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ అయిన తన లుక్ బయటికొస్తుందని భయపడి ఎన్టీఆర్ అన్న ఎమ్యెల్యే ఈవెంట్ కి రాకుండా హ్యాండ్ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ బయటికి వచ్చేసింది. అదెలా అంటే ఎన్టీఆర్ ఇపుడు ఐపీఎల్ కోసం ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఆ యాడ్ ని ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించబోయే త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ యాడ్ షూట్ కి సంబందించి ఒక ఫోటో ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు బయటికొచ్చిన లుక్ తోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. మరి అన్న కళ్యాణ్ రామ్ పిలిస్తే లుక్ బయటికొస్తుందని చెప్పి... ఇప్పుడేమో యాడ్ షూట్ కోసం బయట తిరుగుతున్నాడు. ఈలెక్కన ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ని మోసం చేసినట్టు కాదా అంటున్నారు కొందరు.

కానీ ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తున్నారు. ఎన్టీఆర్ లుక్ బయటికి రాకూడదని ఎమెల్యే ప్రై రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం కాదని... -ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న ఈ సమయంలో స్పెషల్ స్టేటస్ కి సంబందించిన ప్రశ్నలు ఎదురుకునే అవకాశం ఉండటం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయటకి రాలేదని.. అంతేగాని కళ్యాణ్ రామ్ విషయంలో ఎన్టీఆర్ ఎలాంటి తప్పుచేయలేదంటున్నారు. అందులో నిజమెంతుందో తెలియదు గాని ఎన్టీఆర్ న్యూ లుక్ మాత్రం సూపర్ గా వుంది. మరి త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కి ఐపీఎల్ యాడ్ లో ఎన్టీఆర్ లుక్ కి పెద్దగా తేడా ఉండకపోవచ్చని ఊహాగానాలు మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

Similar News