అనుపమ కేకండి

Update: 2017-12-15 05:16 GMT

అ.... ఆ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ తనని తాను ప్రూవ్ చేసుకుంటుంది. అందానికి అందం, అభినయానికి అభినయంతో దూసుకుపోతున్న అనుపమ అచ్చ తెలుగమ్మాయిలా అందరిని ఆకట్టుకుంది. మంచి యాక్టింగ్ స్కిల్స్ తో అనుపమ అవకాశాలు వడిసి పట్టుకుంటుంది. కేవలం సినిమాలతో మాత్రమే అనుపమ హైలెట్ అవవడం లేదు. ఎప్పటికప్పుడు తన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరి కళ్ళలో పడుతుంది.

అందమైన నవ్వు తో ఆకర్షణీయంగా కనబడుతున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ప్రముఖ మ్యాగజిన్ కి ఇచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. JFW కోసం అనుపమ ఇచ్చిన ఫోటో షూట్ చూస్తుంటే అబ్బో అనిపించక మానదు. ఆ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటో షూట్ వీడియో లో ఈ అందాల ముద్దుగుమ్మ అదిరిపోయింది. ఇక ఆ వీడియో అనుపమ తనకి ఏమేమి ఇష్టమో లాంటి విషయాలను కూడా పంచుకుంది. అంతేకాకుండా చాలా ప్రశ్నలకు చాలా తెలివైన సమాధానాలు చెప్పి అనుపమ తెలివైన హీరోయిన్ అనిపించుకుంది.

అవేమిటంటే... నివిన్ - దుల్కర్ సల్మాన్ వంటి హీరోల్లో ఎవరు బెస్ట్ హీరో అని అడిగితే దానికి అనుపమ ఇద్దరు మంచి నటులే.. ఎవరి స్టైల్ వారికీ ఉందని తెలివైన సమాధానం చెప్పడమే కాదు.... అందరిలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే చాలా మంది ఉన్నారు. ఒకరని చెప్పలేము అని కర్ర విగకుండా పాము చావకుండా తెలివైన సమాధానాలతో ఆకట్టుకుంది

Similar News