అనుకున్నది ఒకటి అయినది మరొకటి పాపం

Update: 2016-10-23 06:04 GMT

వెండి తెర నుంచి బుల్లి తెరకు, బుల్లి తెర నుంచి వెండి తెరకు, మళ్లీ వెండి తెర నుంచి బుల్లి తెరకు, ఇప్పుడు అటు బుల్లి తెర పై ఇటు వెండి తెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకుని వున్నది కూడా పోగొట్టుకునే ప్రమాదంలో వుంది హాట్ భామ రష్మీ గౌతమ్. 2002 లో హోలీ చిత్రంతో వెండి తెర కు పరిచయం ఐన నాటి నుంచి బుల్లి తెర పై జబర్దస్త్ తో భారీ గుర్తింపు వచ్చే వరకు అటు వెండి తెర ఇటు బుల్లి తెర పై హుందా గానే కనిపించేది రష్మీ గౌతమ్. కానీ ఇప్పుడు కథానాయిక గా అవకాశాలు అందిపుచ్చుకోవటానికి తాను నమ్మిన ఒకే సిద్దాంతాన్ని పాటిస్తూ అపజయాలు మూట కట్టుకుంటుంది రష్మీ.

మొన్న ఆ మధ్య వచ్చిన గుంటూరు టాకీస్ ఓ మోస్తరు విజయం కాగా పాత్ర ప్రమేయం కథలో తక్కువే ఉన్నా కూడా అడల్ట్ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం కావటం అందులోనూ రష్మీ అందాల ఆరబోతకు ఒక వర్గం ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు కావటంతో ఇక అందాల ఆరబోతలో చిత్రానికి చిత్రానికీ డోస్ పెంచేస్తూ కథానాయిక పాత్ర అయితే నాసి రకపు చిత్రాలలోనూ నటించేస్తుంది రష్మీ. ఆలా విడుదల ఐయి రష్మీ గౌతమ్ కి ఉన్న గుర్తింపుని కూడా మరుగున పడేలా చేసిన చిత్రాలే చారుశీల, రాణి గారి బంగ్లా, అంతం, తాను వచ్చెనంట. ఈ జాబితా లో చిత్రాలు అన్నీ రష్మీ గ్లామర్ వల్ల ప్రచారం పొందినవే కానీ ఏదీ తన క్రేజ్ పెంచలేకపోయింది.

అంతం చిత్ర ప్రచార వ్యూహంలో అయితే ఆ చిత్ర దర్శకుడు తనను మోసం చేసాడు అని బహిరంగంగానే మండిపడింది రష్మీ. ఆ చిత్రం కూడా ఘోర పరాజయం చెందిందే.

Similar News