అనిరుద్ కి భారీ ఛాన్స్ మిస్ అయ్యిందా?

Update: 2017-11-05 17:00 GMT

కోలీవుడ్ లో చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండియా మొత్తం హైలెట్ అయ్యాడు అనిరుద్ రవిచంద్రన్. కోలీవుడ్ లో చేసిన ప్రతి సినిమా ఆల్బం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. అతనికి అక్కడ తిరులేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లోను అడుగుపెట్టాడు ఈ కుర్ర సినీసంగీత దర్శకుడు. టాలీవుడ్ లో ఈ కుర్రాడికి త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఇచ్చాడు.

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల సినిమాకి పనిచేస్తూనే.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల సినిమాకు కూడా అనిరుద్ సంగీతం అందివ్వనున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా భారతీయుడు సినిమా సీక్వెల్ శంకర్, కమల్ హాసన్ ల కలయికలో ‘ఇండియన్-2’ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం చేయనున్నారని వార్తలొచ్చాయి. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకుడిగా కమల్ హాసన్ హీరోగా తెరకెక్కబోతున్న ఇండియన్ 2 కి సంగీత దర్శకుడిగా అనిరుద్ కాదని... ఏ ఆర్ రెహ్మాన్ అనే ప్రచారం మొదలైంది.

అనిరుద్ ఇండియన్ 2 కి సంగీతం అందిస్తాడన్న ఆ వార్తల్లో నిజం లేదని అవి ఒట్టి పుకారులే అని తేలిపోయింది. అసలు ఈ ప్రాజెక్ట్ కోసం అనిరుద్ ని అనుకోవడంగాని, ఆయన్ను సంప్రదించడంగాని జరగలేదని, ఇంకా ఎవర్నీ నిర్ణయించలేదని చిత్ర యూనిట్ తెలిపారట. దీంతో అనిరుద్ కి పెద్ద సినిమా ఛాన్స్ పోయినట్టే అని తెలుస్తుంది. దీంతో రూమర్లకు చెక్ పడింది. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు

Similar News