అనసూయమ్మ కాస్ట్లీ కారు!

Update: 2016-03-30 14:57 GMT

ఆ యాంకర్ కారు రేటెంతో తెలిస్తే హీరోయిన్లకు సైతం కన్ను కుట్టడం ఖాయం. ఏకంగా రూ.93 లక్షలు పెట్టి ఓ యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ లగ్జరీ కారు కొనుగోలు చేయడం టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఆ యాంకర్ మరెవరో కాదు.. అనసూయ భరద్వాజ్. ఆమె ఈ మధ్యే రూ.93 లక్షలు పెట్టి లగ్జరీ ఆడి-క్యూ7 కారు బుక్ చేయడం విశేషం. ఈ కారు ఇంకా అనసూయ ఇంటికి డెలివరీ కావాల్సి ఉంది. ఈ లోపే ఈ విషయం బయటికొచ్చి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.ఓ మూడేళ్లు వెనక్కి వెళ్తే అనసూయ మామూలు అమ్మాయి. మా మ్యూజిక్ ఛానెల్లో వీడియో జాకీగా మామూలుగా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత సాక్షి న్యూస్ ఛానెల్లో న్యూస్ రీడర్ అవతారమెత్తినా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ షోలో యాంకర్ గా మారగానే అనసూయ రాత మారిపోయింది. అప్పటిదాకా ఏ యాంకర్ కనిపించని రీతిలో హాట్ హాట్ దుస్తుల్లో దర్శనమిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించిన అనసూయ చాలా త్వరగా మంచి ఫేమ్ సంపాదించింది.అక్కడి నుంచి మరిన్ని టీవీ షోల్లో యాంకర్ అవకాశాలు రావడం.. ఆడియో ఫంక్షన్లతో పాటు సినిమా వేడుకలకు యాంకరింగ్ చేసే అవకాశం కూడా రావడంతో అనసూయ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది. ఈ మధ్యే సినిమాల్లోకి అడుగుపెట్టి అక్కడా సక్సెస్ అయ్యింది అనసూయ. ఆమె నటించిన సోగ్గాడే చిన్నినాయనా.. క్షణం.. సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఆమె చేతిలో యాంకర్ గా, నటిగా మంచి అవకాశాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లగ్జరీ కారు కొని మరింతగా వార్తల్లో నిలిచింది అనసూయ.

Similar News