అనసూయది ఆ పాత్ర కాదా?

Update: 2018-01-20 05:31 GMT

యాంకర్స్ ప్రపంచంలో ఎవరి టాలెంట్ తగ్గట్టు వాళ్లు వారి కెరీర్ ను బాగానే నెట్టుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా యాంకర్ అనసూయ. అనసూయ యాంకరింగ్ తోనే కాదు తన అందచెందాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయింది. ముఖ్యంగా కుర్రకారు అనసూయ అందాలకు చాలా వరకు ఫిదా అవుతున్నారు.

సినిమాల్లో కూడా ఆమె స్పెషల్ క్యారెక్టర్స్ చేసి అందరిని ఆనందింపజేస్తుంది. తాను చేసిన సినిమాలన్నింటి లో నెక్స్ట్ రాబోతోన్న రంగస్థలం సినిమాలో చేసిన పాత్ర అద్భుతం అంటోంది. ఈ సినిమాలో అనసూయ, రామ్ చరణ్ కు అత్తగా నటిస్తుందని అనే వార్తపై సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చింది.

అదేమిటంటే.. రంగస్థలం సినిమాలో మీరు రామ్ చరణ్ కు అత్తగా కనిపించబోతున్నారు అని తెలిసింది. నిజమేనా? అని కొంత మంది నెటీజన్స్ అడిగిన ప్రశ్నకు..అయ్యో అది కాదు బాబోయ్ అనే విధంగా సమాధానం ఇచ్చింది. మరి సినిమాలో ఆ స్పెషల్ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే.. మార్చ్ ఎండింగ్ వరకు ఆగాల్సిందేనట.

Similar News