అనసూయకి దక్కిన అదృష్టం శ్రీముఖిని వరించకపోవటానికి కారణం....

Update: 2017-03-28 05:59 GMT

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై హాట్ యాంకర్స్ గా చేతినిండా వివిధ ప్రోగ్రామ్స్ అవకాశాలతో బిజీగా గడుపుతున్న అందాల భామలు రష్మీ గౌతమ్, శ్రీముఖి, అనసూయ. ఒకప్పటిలా వెండితెరకి బుల్లితెరకు మధ్య వ్యత్యాసం క్రమణీయంగా తగ్గుతుండటంతో సినిమా ఆర్టిస్ట్స్ అడపాదడపా బుల్లితెర ఆర్టిస్ట్స్ గా, బుల్లితెర ఆర్టిస్ట్స్ సినిమా ఆర్టిస్ట్స్ గా కూడా అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు. కాగా ఈ ముగ్గురు హాట్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఇప్పటికే కథానాయికగా పలు చిత్రాలలో నటించింది. రానున్న కొద్ది నెలలో రష్మీ నటించిన మరో రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధం అవుతున్నాయి. గత ఏడాది సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం చిత్రాలతో అనసూయ కూడా వెండితెరపై మెరిసి సక్సెస్ అయ్యింది. ఇక గత నెలలో విడుదలైన మెగా ఫ్యామిలీకి చెందిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో 'సూయ సూయ అనసూయ' పాటలో మెరిసి మెగా అభిమానులకి దగ్గరై రెట్టింపు పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ.

ఇలాంటి అవకాశమే శ్రీముఖి తలుపు తట్టినట్టే తట్టి దాటుకుని వెళ్లిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మిస్టర్ చిత్రంలో కీలక సన్నివేశంలో వచ్చే ఓ ప్రత్యేక గీతానికి హాట్ యాంకర్ శ్రీముఖి చేత పెర్ఫార్మ్ చేపించాలని ముందుగా అనుకున్నారట దర్శకుడు శ్రీను వైట్ల. కానీ వరుణ్ తేజ్ ఆరు అడుగుల పైన మూడు అంగుళాలు పొడుగు ఉండటంతో అతని పక్కన శ్రీముఖి హైట్ ని మేనేజ్ చేయటం కష్టం అని భావించి ఆ పాట నుంచి శ్రీముఖిని తప్పించి బాహుబలి ది బిగినింగ్ లో మనోహరా పాటలో మెరిసిన హాట్ మోడల్ మధు స్నేహతో ఈ పాట చిత్రీకరణ కానిచ్చేస్తున్నాడట శ్రీను వైట్ల. వరుణ్ తేజ్ సరసన డాన్స్ చేసి వెండితెరపై కనిపిస్తే మెగా అభిమానులకు చేరువ అవ్వొచ్చు అనుకున్న శ్రీముఖి కి నిరాశే మిగిలింది పాపం.

Similar News