అదితి... నువ్వు ఉన్నావ్ చూడు...?

Update: 2018-02-24 12:00 GMT

అమ్మాయిది హైదరాబాద్ అయినా బాలీవుడ్ లోనే స్థిరపడి.. అక్కడ సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఏదో చెలియా తో సౌత్ లో కొద్దిగా ఫేమ్ సంపాదించినా ఆ సినిమా డిజాస్టర్ అయినా.... అదితి రావు హైదరి కి ఇప్పుడు సుధీర్ - ఇంద్రగంటి సినిమా సమ్మోహనంలో మంచి పాత్రే దక్కింది. అదితి అందాలు సౌత్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. చెలియాలో అదితి పాత్ర చాలా డీసెంట్ గా ఉంటుంది. అయితే అమ్మడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ సినిమాల్లో అదితి అందాల ఆరబోత చెప్పక్కర్లేదు. ఇకపోతే ఈ మధ్యనే దీపికా పదుకొనె మెయిన్ లీడ్ లో తెరకెక్కిన పద్మావత్ చిత్రంలోనూ ఒక కీ రోల్ లో నటించింది.

సమ్మోహనంలో......

ఇకపోతే సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సమ్మోహనం చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్న అదితి ఈ చిత్రంలో అందాల ఆరబోతకు హద్దుల్లేవంటుంది. ఇంద్రగంటి డైరెక్షన్ లో ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు అప్పుడే మెల్లగా స్టార్ట్ చేసేశారు. ఈ చిత్రంలో నుంచి బయటికొచ్చిన అదితి స్టిల్ ఒకటి ఇంటర్నెట్ లో రచ్చ చేస్తుంది. ఫ్లవర్ డిజైన్ టాప్ మాత్రమే ధరించి..... తన నవ్వుతోనే సమ్మోహన పరుస్తున్న అదితి పిక్ నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఏమి అందం...?

కనిపించి కనిపించని అందాలతో.... కొంటె చూపుతో... పూల మధ్యలో మెరిసిపోతున్న అదితి అదరగొడుతుంది. మరి ఇప్పటివరకు అదితి అందాలను మన తెలుగు దర్శకులకు ఎందుకు దొరకలేదో.. ఎందుకంటే... బాలీవుడ్ లో కాస్త ఫేమ్ ఉన్నా చాలు వెంటనే వారిని తెలుగులోకి దింపడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. మరి ఇప్పటివరకు ఈ అదితి ఎలా మిస్ అయ్యింది చెప్మా అంటున్నారు కొందరు.

Similar News