అదరహో... అనిపించాడుగా..!!

Update: 2016-12-28 15:17 GMT

చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150 ' ఆడియో వేడుకని జరపకుండా సాంగ్స్ ని నేరుగా ఒక్కొక్కటి మార్కెట్ లోకి రిలీజ్ చేసేస్తున్నారు. 'ఖైదీ.... 'కి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ 'ఖైదీ నెంబర్ 150 ' మ్యూజిక్ అదరగొట్టేసాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తుంటే 'ఖైదీ...' ఆల్బమ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. మొదటి సాంగ్ గా రిలీజ్ చేసిన 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ సంచలనం. ఆ తర్వాత వచ్చిన 'సుందరి' సాంగ్ కూడా అదరహో అనిపించింది. ఇక కొద్దిసేపటి క్రితమే 'యూ అండ్ మీ సాంగ్ 'ను సోషల్ మీడియాద్వారా విడుదల చేశారు. దేవిశ్రీ మ్యూజిక్ ని తనదైన స్టయిల్లో ఇచ్చి అరిపించేసాడు. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' చిత్రం ఆల్బమ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ది బెస్ట్ గా నిలుస్తుందనడం లో ఏ మాత్రం సందేహం లేదు.

ఇక ఈ సాంగ్స్ ఇప్పటివరకు ఆడియోలోనే విడుదల చేసారు. ఇక వీడియో సాంగ్స్ విడుదల చేస్తే చిరు, కాజల్ డాన్స్ పెరఫామెన్స్ కి మెగా ఫ్యాన్స్ పడిపోయేవారు. ఈ సినిమా ఆడియో ని కొన్ని కారణాల వల్ల వైభవం గా జరపలేకపోయినప్పటికీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని మాత్రం అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ వాళ్ళు. ఇక ఈ ఫంక్షన్ ని విజయవాడలో జరిపించనున్నారని అంటున్నటున్నారు. అయితే 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగా బ్రదర్స్ తో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ఫంక్షన్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

Similar News