అతగాడి పార్టీలో అతిధులకు చిరు సర్వ్ చేసాడట

Update: 2017-01-29 12:21 GMT

ఈ నెల 25 న విడుదలైన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు పాజిటివ్ టాక్ తో తొలి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతున్నాయి. హ్రితిక్ రోషన్ నటించిన కాబిల్, షారుఖ్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రాలు భారీ విజయాలు సాధిస్తున్నప్పటికీ విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం మాత్రం కాబిల్ ఒక్కటే. రాయిస్ చిత్రంలో రెగ్యులర్ గా వుండే వాణిజ్య అంశాలు అధికంగా కనిపించగా కాబిల్ చిత్రంలో అంధులుగా కనిపించిన హ్రితిక్ రోషన్ మరియు యామి గౌతమ్ లు తమ నటనతో ఆకట్టుకోగా, కథ కథనాలలో వున్నా బలమైన అంశాలు ప్రేక్షకులతో పాటు విమర్శకులను కట్టిపడేస్తున్నాయి. కాబిల్ చిత్రం తెలుగు లో బలం గా విడుదలై మంచి వసూళ్లు రాబడుతుంది. దక్షిణాదిన ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ తో సమానమైన మార్కెట్ కోసం హ్రితిక్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన నటించిన బాంగ్ బాంగ్, మోహేనజదరో వంటి చిత్రాలు ఆయనను నిరాశ పరుస్తూ వచ్చాయి. ఇప్పుడు కాబిల్ తో ఆయన ఎంత కాలం నుంచో వేచి చూస్తున్న సక్సెస్ అందటంతో దక్షిణాది మార్కెట్ పై హ్రితిక్ కన్నేశారు.

బలం ప్రమోషన్ లో భాగంగా చిత్రం విడుదల అనంతరం కూడా తెలుగు మీడియాకి వరుస ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు హ్రితిక్ రోషన్. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ, "నేను తెలుగు సినిమాలు చేయనప్పటికీ నాకు చిరంజీవి గారితో ఎప్పటి నుంచో పరిచయం వుంది. నేను ఆయనను చాలా సార్లు కలిసాను. ఆయనని చూసిన ప్రతి సారి ఆయన ప్రవర్తనకి ఆశ్చర్య పోతూనే వుంటాను. ఆయన మెగా స్టార్ అని మనం అనుకోవటమే తప్ప ఆయనకి అటువంటి ప్రత్యేక గుర్తింపులు వున్నా మనిషిలా ఆయన ప్రవర్తించరు. ఆయనలో ఆ సింప్లిసిటీ నాకు బాగా నచ్చే లక్షణం. ఒకసారి బొంబాయి లో నేను ఇచ్చిన ఒక పార్టీ కి చాలా మంది స్టార్స్ హాజరు అయ్యారు. వారిలో చిరంజేయేవి గారు కూడా వున్నారు. ఆ పార్టీ లో చిరంజీవి గారు చొరవ తీసుకుని మరీ ఇతర స్టార్స్ కి ఆయన స్వయంగా డిన్నర్ సర్వ్ చేశారు. ఆ పార్టీ కి వచ్చిన అతిధులలో చాలా మంది చిరంజీవి గారి కంటే వయసులో, అనుభవంలో చాలా చిన్నవారైనప్పటికీ ఆయన ఆ అహము చూపకుండా అందరితో వ్యవహరించిన తీరు నన్ను బాగా ఆశ్చర్య పరిచింది." అంటూ చిరు క్యారెక్టర్ ని తెగ పొగిడేసాడు హ్రితిక్.

ఇప్పటి వరకు ఈ విషయాలు ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు బహిర్గతం చేయటంతో బలం సినిమా ని తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో హ్రితిక్ పడుతున్న పాట్లలో చిరు భజన కూడా ఒకటి అయ్యుండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Similar News