అజ్ఞాతవాసి పై వివాదం?

Update: 2018-01-10 04:06 GMT

పవన్ కళ్యాణ్ గొంతు సవరించి అజ్ఞాతవాసి చిత్రంలో ఓక పాట పాడిన సంగతి తెలిసిందే. ‘కొడకా కోటేశ్వర్ రావు’ అంటూ దంచి కొట్టి వదిలాడు. ఈ పాటను పవన్ పాడిన విధానం, త్రివిక్రమ్ ఆ పాట వింటూ ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని... అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఇలా ఈ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. పవన్ మ్యానరిజం, స్టయిల్ తో ఆ పాటని ఎక్కడికో తీసుకెళ్లాడు. ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనాలకు తెర తీసిన ఈ పాట వివాదస్పదమైంది. సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఈ పాట వివాదంలో ఇరుక్కుంది.

ఈ చిత్రంలో పవన్ పాడిన ఆ ‘కొడకా కోటేశ్వర్ రావు’ అనే పాట కోటేశ్వర్ రావు అనే పేరు ఉన్న వారి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉందని న్యాయవాది కోటేశ్వరరావు విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ పాటలోని కోటేశ్వరరావు అనే పదాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఆ విషయం జరిగి కొన్ని గంటలు గడుస్తున్నా ఈ విషయం పై చిత్ర బృందం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇక అజ్ఞాతవాసి చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనది.

Similar News