అచ్చం బాహుబలిలా

Update: 2017-10-02 09:00 GMT

రాజమౌళి బాహుబలి సినిమాకి ఎక్కువగా పబ్లిసిటీ చేసినట్లే కనబడలేదు.... కానీ పబ్లిసిటీని మాత్రం ఇరగదీసే రేంజ్ లో చేసాడు. అసలు రాజమౌళికన్నా ముందే బాహుబలిపై మీడియా ఫోకస్ పెట్టడం.. ఆ చిత్రానికి ఫ్రీగా పబ్లిసిటీ చెయ్యడం జరిగింది. సోషల్ మీడియాలో అయితే బాహుబలికి జరిగిన పబ్లిసిటీ మరే ఇతర సినిమాకి జరిగుండదు. అంతలా సోషల్ మీడియా లో బాహుబలిని పబ్లిసిసిటి చేశారు. అయితే రాజమౌళి కూడా తన వైపు నుండి పబ్లిసిటీ మీద మంచి కాన్సంట్రేట్ చేసి బాహుబలిని నాలుగు నోళ్ళలో నానేలా చేయగలిగాడు. అందులో భాగంగానే బాహుబలి ప్రాజెక్ట్ పట్టాలెక్కింది మొదలు అందులో నటించిన నటీనటుల పాత్రలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ ని ఆయా పాత్రలు పోషించిన హీరోహీరోయిన్స్ పుట్టిన రోజు సందర్భంగా వదిలి మంచి పబ్లిసిటీ కి నాంది పలికాడు

అయితే ఇపుడు ఇదేతరహాలో భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సాహు చిత్రం బృందం కూడా అలాంటి పబ్లిసిటీ నే ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు సాహో న్యూస్ ఏమి బయటికి పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్న చిత్ర బృందం ఇప్పుడు మాత్రం బాహుబలి పబ్లిసిటీ రేంజ్ లోనే సాహో పబ్లిసిటీని మొదలెట్టబోతున్నారు అని అంటున్నారు. అది ఎలా అంటే సినిమా మొదలు కాకముందే సాహో టీజర్ ని వదిలిన చిత్ర బృందం ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే రోజున అంటే అక్టోబర్ 23 న సాహో ఫస్ట్ మేకింగ్ టీజర్‌ను విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట.

సాహో ఫస్ట్ మేకింగ్ టీజర్‌ను ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా ఈనెల 23న రిలీజ్ చేయబోతున్నారని సమాచారం అందుతుంది. మరి రాజమౌళిలాగే దర్శకుడు సుజిత్ తోపాటు యువి క్రియేషన్స్ వారు కూడా బాహుబలి రెండు భాగాలకూ ఇలా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా మేకింగ్ అలాగే.. ప్రభాస్ లుక్ రిలీజ్ చేసి బాహుబలికి క్రేజ్ తీసుకొచ్చినట్టే ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే సాహోకి కూడా ఫాలో అవ్వాలని ప్లాన్ లో ఉన్నారట సాహో టీమ్ సంభ్యులు. మరి సాహోకి బాహుబలి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో అనేది ఈ నెల 23 న తెలిసిపోతుంది.

Similar News