అచ్చం ప్రియాలాగే చేసిన మెగా హీరో?

Update: 2018-02-24 11:57 GMT

ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ టాపిక్కే నడుస్తుంది. ఆ అమ్మాయి అలా కన్ను కొట్టిందో లేదో... ఇలా సెన్సేషన్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఎక్కడ చూసినా ప్రియా ప్రకాష్ పేరే వినబడుతుంది. 'ఒరు అదార్ లవ్' సినిమాలోని ఒకే ఒక్క పాటతో సెన్సేషన్ అయిన ప్రియను టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతున్నాడు అంటేనే అమ్మాయి కున్న ఫాలోయింగ్ ఏంటో అర్ధమవుతుంది.

గన్ షాట్ పేల్చినట్లుగా.....

ఇప్పుడు తమ సినిమాలో ప్రియా ప్రకాష్ ని హీరోయిన్ గా బుక్ చెయ్యడానికి కుర్ర హీరోలు రెడీ అవుతున్నారు. ఇకపోతే ప్రియా 'ఒరు అదార్ లవ్' సినిమాలోని ఓ పాట‌లో హావ భావాలను ఇప్పుడొక తెలుగు స్టార్ హీరో ఫాలో అవుతున్నాడు. అతనెవరో కాదు ప్రియా హావభావాలకు మొదట్లోనే పడిపోయిన అల్లు అర్జున్ ఇప్పుడు ప్రియా వారియ‌ర్ చేసిన‌ట్లే.. ముద్దు పెడుతూ గన్ షాట్ పేల్చినట్టుగా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ముద్దుల కొడుకు ఆయాన్ తో కలిసి అల్లు అర్జున్ ఇలా చేసాడు.

బెడ్ పై పడిపోయి....

అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ కి తన చూపుడు వేలు.... మధ్య వేలుకు ముద్దుపెట్టి... తన కొడుక్కి దాన్ని గురిపెట్టి షూట్ చేశాడు. అల్లు అర్జున్ అలా షూట్ చేయ‌డంతో అయాన్ కూడా బెడ్ పైన ఉన్నవాడు కాస్తా బెడ్‌పైకి దూకేసి కిలా కిలా నవ్వుతున్నాడు. వెంటనే అల్లు అర్జున్ అయాన్ ని చేతుల్లోకి తీసుకునే వీడియో ని అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

Similar News