అగ్ర హీరోల అభిమానుల మధ్య ముదిరిన వైరం

Update: 2017-02-08 22:00 GMT

మన దేశంలో క్రికెట్ మరియు సినిమా రంగాలలోని స్టార్స్ కి ఉన్నంత క్రేజ్ మరెవరికి ఉండదు అనటంలో అతిశయోక్తి ఉండదు. పురాణాలలో ఈశ్వరుడి భక్తుల వర్గం ఒకటి, విష్ణు భక్తుల వర్గం అని రెండు వేరు వేరు వర్గాలుగా దైవాన్ని ఆరాధించే వారు విడిపోగా వీరి మధ్య వైరం అడ్డ బొట్టు వాళ్లకి నిలువ బొట్టు వారు చిరకాల శత్రువులుగా మిగిలిపోయినట్టు నేటి కాలంలో డెమి గాడ్స్ గా ట్రీట్ చేయబడుతున్న సినిమా హీరోల అభిమానుల మధ్య పరిస్థితి కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకి మించి ఇప్పుడు సోషల్ మీడియా ఇందుకు వేదికగా మారుతుంది. తమిళ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్, రజని కాంత్ ల తరం అనంతరం అజిత్, విజయ్ లకు అంతటి క్రేజ్ వచ్చింది.

కమల్ హాసన్ పురస్కారాలకు ప్రతిష్ట తీసుకు వస్తే, రజని కాంత్ వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తుంటారు. వీరి మధ్య పోటీ కానీ, వీరి అభిమానుల మధ్య అర్థరహితమైన విభేదాలు కానీ ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కానీ ప్రస్తుత కథానాయకుల అభిమానులలో ఇటువంటి లక్షణాలు మచ్చుకి కూడా కనిపించటం లేదు. తమ అభిమాన హీరోని ప్రమోట్ చేసుకునే క్రమంలో ఇతర హీరోల పై దుమ్మెత్తిపోస్తూ పలు కామెంట్స్ ని సోషల్ మీడియాలో చేస్తున్నారు. తాజాగా వివేకం అనే చిత్రం ఫస్ట్ లుక్ లో అజిత్ తన సరికొత్త బాడీ బిల్డింగ్ తో ఆశ్చర్యపరచగా విజయ్ అభిమానులు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ట్రాలింగ్ మొదలు పెట్టారు. ఎవరో బాడీ కి అజిత్ ముఖాన్ని అతికించి పోస్టర్ విడుదల చేసారంటూ చేసిన పలు కామెంట్స్ పై ఒక ప్రముఖ తమిళ మీడియా ఛానల్ అరగంట కార్యక్రమం ప్రసారం చేయటంతో ఈ వివాదం చినికి చినికి గాలి వాన ఐయ్యింది. ఒకవేళ అజిత్ నిజంగా వర్క్ ఔట్స్ చేసి బాడీ బిల్డింగ్ చేసి ఉంటే మేకింగ్ వీడియో విడుదల చేయాలని సోషల్ మీడియా లో విజయ్ అభిమానులు సవాల్ చేస్తుండగా వారికి కౌంటర్ ఇవ్వటానికి అజిత్ అభిమానులు తమ హీరోకి ఇటువంటి ఫాల్స్ పబ్లిసిటీ వీడియోస్ అలవాటు ఉండదు అని చిత్రం విడుదల ఐన తరువాత ఆరోపించిన వారందరు నోర్లు మూసుకోవటం ఖాయమని సమర్ధించుకుంటూ తమ హీరోని డిఫెన్సె చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ హీరోలపై ట్రాల్లింగ్ కొనసాగుతూనే వుంది.

Similar News