అఖిల్ హలోకున్న క్రేజ్ చూశారూ...?

Update: 2017-10-09 15:00 GMT

అక్కినేని అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమాలో నటిస్తున్నాడు. మొదటి సినిమా అఖిల్ తో బాగా దెబ్బతిన్న అఖిల్ తన రెండో సినిమా విషయంలో తండ్రి నాగార్జున తో కలిసి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిర్మాతగా నాగార్జున కూడా అఖిల్ రెండో సినిమా బాధ్యతలను విక్రమ్ కుమార్ చేతుల్లో పెట్టినా కూడా... ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎలాగైనా హలో సినిమాతో అఖిల్ కి మంచి హిట్ ఇవ్వాలని నాగార్జున గట్టిగా ప్రయత్నించడమే కాదు.. సినిమా నిర్మాణం విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ప్రేమకథతో వస్తున్న అఖిల్ హలో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న హలో సినిమా థియేటరికల్ రైట్స్ కు క్రేజీ ఆఫర్లే వస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా హలో సినిమా ఓవర్సీస్ హక్కులకు ఊహించని రేటు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఓవర్సీస్ లో హలో సినిమాకు దాదాపు 5 కోట్ల వరకు చెల్లించేందుకు ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ డెబ్యూ సినిమా అఖిల్ ఓవర్సీస్ లో భారీ నష్టాలూ చవి చూసినప్పటికీ అఖిల్ రెండో సినిమా హలో మీద మంచి క్రేజ్ ఉందనడానికి ఇదే నిదర్శనమంటున్నారు.

ఇక ఓవర్సీస్ లో వచ్చిన పాజిటివ్ బజ్ తో ఇక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హలో కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు విక్రమ్ కుమార్ కే అంటున్నారు. ప్రేమ కథలను తెరకెక్కించడంలో విక్రమ్ కుమార్ కున్న స్టయిల్ కే ఇ హలో సినిమాకి ఇలాంటి భారీ క్రేజ్ వచ్చిందంటున్నారు. హలో సినిమాని కూడా విక్రమ్ కుమార్ కొత్త ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడనే టాక్ మొదటినుండి ఉంది.

Similar News