అఖిల్ హలో టీజర్ పోస్టర్ ఎలా వుంది

Update: 2017-11-13 12:00 GMT

నాగార్జున కొడుకు అఖిల్.. అఖిల్ తో దెబ్బతిన్న తర్వాత తన రెండో సినిమాని మొదలెట్టడానికి చాలానే భయపడిపోయాయడు. అటు నాగార్జున కూడా తన కొడుకుని గ్రాండ్ గా అఖిల్ సినిమాతో లాంచ్ చేస్తే ఇలా అయ్యిందేమిటా అని కంగారు పడ్డాడు. కానీ మళ్ళీ అఖిల్ ని రీ లంచ్ చెయ్యడానికి తగిన ఏర్పాట్లతో విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో హలో సినిమాని రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్ ఇండస్ట్రీకి మరోసారి రీ లంచ్ అవ్వనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్న చిత్ర బృందానికి ఫస్ట్ లుక్ ని విడుదల చేయకముందే ... ఆ లుక్ నెట్ లో లీక్ అయ్యింది. వెంటనే తేరుకున్న నాగార్జున ఆ హలో ఫస్ట్ లుక్ ని ఆఫీసియల్ గా విడుదల చేసేసాడు. ఇక ఇప్పుడు కూడా హలో టీజర్ కి సంబందించిన టీటీజర్ పోస్టర్ కూడా లీకైంది.

ఆ పోస్టర్ లో అఖిల్ బైక్ రైడ్ చేస్తూ కనబడుతున్నాడు. ఇక అఖిల్ సినిమాని వచ్చేనెల అంటే డిసెంబర్ 22 న విడుదల చేస్తున్న సందర్భంగా అఖిల్ ప్రమోషన్ ని వేగవంతం చెయ్యడానికి గాను అఖిల్ టీజర్ ని విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ హలో టీజర్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ సినిమా టీజర్ కి అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట. టీజర్ లో సినిమా కంటెంట్ ని నాగార్జున చేత చెప్పిస్తే బాగుంటుంది అని చిత్ర యూనిట్ భావించినట్టుగా తెలుస్తుంది. ఇక టీజర్ కి సంబంధించి లీకైన పోస్టర్ లో అఖిల్ రేసర్ లా కనబడుతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా హిట్ అందుకుని హీరోగా నిలబడాలని అఖిల్ చాలానే కష్టపడుతున్నాడు.

ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా అక్కినేని ఫామిలీ కి మనం వంటి సూపర్ డూపర్ హిట్ అందించి... ఇప్పుడు అఖిల్ కి హలో హిట్ ఇవ్వడానికి బాగా కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాని నాగార్జున తన ఓన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. అఖిల్ కి జోడిగా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తుంది.

Similar News