అఖిల్ తో పూజ ఎలా ఉంది

ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ తో ఓ ఆటాడుకుంటున్న పూజ హెగ్డే కి చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు. తనకి ఎక్కడ బాగా గిట్టుబాటు అవుతుందో [more]

Update: 2019-12-02 07:23 GMT

ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ తో ఓ ఆటాడుకుంటున్న పూజ హెగ్డే కి చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు. తనకి ఎక్కడ బాగా గిట్టుబాటు అవుతుందో అక్కడ అవకాశం పట్టేస్తుంది. తాజాగా మహేష్, ఎన్టీఆర్ లతో చుట్టేసిన పూజ హెగ్డే ఇప్పుడు అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పెయ్యబోతుంది. ప్రభాస్ జాన్ తో మల్లి సెట్స్ మీదకేల్లబోతున్న పూజ, వరుణ్ తో వాల్మీకి అంటూ అదరగొట్టేసింది. పూజ హెగ్డే ఇప్పుడు అఖిల్ తో ప్రయాణం మొదలెట్టీసింది. బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ చేస్తున్న నాలుగో సినిమాలో పూజ హీరోయిన్. అయితే షూటింగ్ మొదలైనప్పుడు పూజ హెగ్డే సెట్స్ లో అడుగుపెట్టే వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకుల్ #అఖిల్4 విషయాలేమి బయటికి రాలేదు.

కానీ తాజాగా అఖిల్ తో పూజ హెగ్డే పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పూజ హెగ్డే సారీ లో జడవేసుకుని ట్రెడిషనల్ గా ఉండగా అఖిల్ మాత్రం డిజైనర్ డ్రెస్ తో క్లాసీగా కనిపిస్తున్నాడు. ఇక పూజ హెగ్డే తన ఫోన్ లో అఖిల్ తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూజ హెగ్డే ట్రెడిషనల్ గా, అఖిల్ కూడా ట్రెడిషనల్ వెర్ లో కనిపిస్తున్నారు అంటే.. వీళ్ళ కేరెక్టర్స్ సినిమాలో ఎలా ఉండబోతున్నాయి అనే క్యూరియాసిటీ అక్కినేని ఫాన్స్ లో మొదలైంది. అలాగే వీరిద్దరూ సాంప్రదాయంగా ఉన్నారు అంటే… సినిమా లో ఏ పెళ్లి సీనో షూట్ చేస్తున్నారేమో అంటున్నారు. మరి బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమాలు కావడంతో అఖిల్ – పూజ లు కూడా ట్రెడిషన్ గా క్లాసీ లుక్ లోనే సినిమా ఉండబోతున్నారనే డౌట్ కొడుతోంది

Tags:    

Similar News