అక్కినేనిగా దేవరకొండ?

Update: 2017-11-07 15:00 GMT

'అర్జున్ రెడ్డి' సినిమా తో ఒక్కసారి ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. కుర్రకారుకి యూత్ ఐకాన్ గా మరీనా విజయ్ దేవరకొండ బయట షాప్ ఓపెనింగ్స్ అంటూ... సినిమా ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ అంటూ తెగ బిజీగా అయిపోయాడు. అయితే విజయ్ దేవరకొండ మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ అశ్విన్ తెరేకేక్కిస్తున్న 'మహానటి' సినిమా లో కూడా నటిస్తున్నాడు. టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ సావిత్రి పాత్రని పోషిస్తున్న ఈ సినిమా లో అక్కినేని సమంతా కూడా ఒక ముఖ్య పాత్ర లో నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండని కూడా ఎంపిక చేశారన్నారు గానీ... అది ఏపాత్రకో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ మహానటి లో అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రని పోషిస్తున్నాడట. ఇప్పటికే జెమినీ గణేషన్ పాత్రకి దుల్కర్ సల్మాన్ ఎంపికవడమే కాదు... అతని పాత్ర తాలూకు షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది. 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అశ్విని దత్ కుమార్తె అయిన ప్రియాంక దత్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అయితే ఇప్పటివరకు ఏఎన్నార్ పాత్రని నాగ చైతన్య, ఎన్టీఆర్ పాత్రని జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తారని ప్రచారం జరిగినప్పటికీ... ఇప్పుడు తాజాగా ఏఎన్నార్ పాత్రలో విజయ్ నటిస్తాడంటున్నారు. మరి సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కోసం మరే హీరోని ఈ సినిమాలో భాగస్వామ్యం చెయ్యబోతుందో చిత్రయూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమా లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, శాలిని పాండే కూడా పలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Similar News