అక్కినేని ఫ్యామిలీకి షాక్

Update: 2018-01-04 17:15 GMT

అక్కినేని ఫ్యామిలీ కి కేంద్రం మాములుగా షాక్ ఇవ్వలేదు... గట్టి షాక్ ఇచ్చింది. ఐటీ రిటర్న్స్‌ సమర్పించకపోవడంతో కేంద్రం అక్కినేని కుటుంబంపై కొరడా ఝులిపించింది. ఏకంగా అక్కినేని ఇంటర్నేషనల్‌ పౌండేషన్‌ గుర్తింపును రద్దు చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రకటించారు. ఐటీ రిటర్న్స్‌ సమర్పించని పలు ఎన్జీవో సంస్థలను గుర్తించామని…. వాటి గుర్తింపును రద్దు చేసినట్టు మంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే అక్కినేని ఇంటర్నేషనల్‌ పౌండేషన్‌ గుర్తింపును కూడా రద్దు చేసినట్లు చెప్పారు.

అయితే ఈ ఎన్జీవోల జాబితాలో తెలంగాణ నుంచి 190 ఉండగా... ఏపీ నుంచి ఏకంగా 450 సంస్థలున్నాయి. ఇకపోతే ఈ ఫౌండేషన్స్ మొత్తం విదేశాల నుంచి నిధులు సేకరిస్తూ ఆ వివరాలను రిటర్స్న్‌లో వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపును కూడా ఇదేకారణంతో రద్దు చేసింది కేంద్రం. మరి ఈసంస్థ ద్వారానే అక్కినేని కుటుంబం అక్కినేనినాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రదానం చేస్తోంది.

Similar News