అక్కినేని కోడలు యోగాసనం!!

నిన్నమొన్నటివరకు అక్కినేని కోడలు సమంత అక్కినేని కూడా కరోనా బారిన పడింది అంటూ వార్తలోపిచ్చాయి. ఆమె బెస్ట్ ఫ్రెండ్ శిల్ప రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో సమంతకి [more]

Update: 2020-07-01 08:02 GMT

నిన్నమొన్నటివరకు అక్కినేని కోడలు సమంత అక్కినేని కూడా కరోనా బారిన పడింది అంటూ వార్తలోపిచ్చాయి. ఆమె బెస్ట్ ఫ్రెండ్ శిల్ప రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో సమంతకి కూడా కరోనా వచ్చేసింది అని అనుకున్నారు. కానీ సమంత తనకి కరోనా లేదనిగాని, ఉందని కానీ చెప్పలేదు. అలాగే శిల్ప రెడ్డి హోమ్ క్వారంటైన్ లోనే ఉండి కరోనా ని తరిమికొట్టింది. తనకి నెగెటివ్ వచ్చింది అని.. తాను సేఫ్ అని కరోనా వలన భయపడ వద్దని చెప్పింది. అయితే సమంత మాత్రం కరోనా విషయాలేమి మాట్లాడకుండా తన ఆపనిలో తాను బిజీగా వుంది. టెర్రస్ పై ఆకు కూరలు, కూరగాయలు పండించడమే కాదు… వర్కౌట్స్ తోనూ బాగా బిజీగా ఉంటుంది.

ఈమధ్యన సమంత జిమ్ లో వర్కౌట్స్ కన్నా యోగాసనాలతో కొవ్వు కరిగిస్తుంది. యోగ చేస్తే బాడీ చాల  తేలికగా ఉంటుంది.. యోగ తో ఆరోగ్యం వస్తుంది అంటూ యోగాని ప్రమోట్ చెయ్యడమే కాదు.. యోగాసనాలతో సోషల్ మీడియాని ఊపేస్తోంది. మొన్నటికి మొన్న బ్రీతింగ్ యోగాసనం చపాసించిన సమంత.. మొన్న రెండు చేతులని కింద పెట్టి.. బాడీ మొత్తం గాల్లోకి లేపి వేసిన యోగసం హైలెట్ అయ్యింది. తాజాగా సమంత రెండు కాళ్లను పైకి పెట్టి… తల కిందకి కిందకి పెట్టి గాల్లో వేలాడుతున్న యోగాసనం ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత హాట్ గా యోగ డ్రెస్ లో అలా తల్లకిందులుగా చేస్తున్న యోగ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Tags:    

Similar News