అక్కడ అంత హైప్.. కానీ ఇక్కడ?

Update: 2017-12-04 07:00 GMT

మరొక్క నెల మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల కావడానికి. ఇప్పటినుండే సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. రోజూ 'అజ్ఞాతవాసి' సినిమా గురించిన న్యూస్ లే సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'అజ్ఞాతవాసి' సినిమా టికెట్స్ ధరలు పెరుగుతున్నాయని.. సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయని.. ప్రమోషన్ కూడా వెరైటీగా చేపడుతున్నారని ఇలా రకరకాల న్యూస్ లు వస్తున్నాయి. 'అజ్ఞాతవాసి' సినిమా కి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు డొమెస్టిక్ ఫ్లైట్స్ ని, మరో పక్క ఎక్కడా లేని విధంగా మెట్రో ట్రైన్స్ ని కూడా వాడెయ్యడానికి రెడీగా వున్నారు.

హైదరాబాద్ లో మెట్రో తాజాగా ఓపెనింగ్ జరుపుకుని సక్సెస్ ఫుల్ గా ట్రాక్ ఎక్కిన విషయం తెలిసిందే. ఆ మెట్రో ట్రైన్స్ మీద 'అజ్ఞాతవాసి' స్టిక్కేరింగ్ లు, PSPK25 మొబైల్ ఫోన్స్ ఇలా కొత్త కొంగొత్తగా ప్రమోషన్స్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న 'అజ్ఞాతవాసి' క్రేజ్ మాత్రం ఏ లెవల్లో ఉందొ అనేది కొలమానంలో కొలవడం కష్టం. అలాంటి 'అజ్ఞాతవాసి' సినిమా స్టోరీ లైన్ దర్శకుడు త్రివిక్రమ్ 2008లో రిలీజైన ఫ్రెంచ్ ఫిల్మ్.. ‘లార్గో వించ్’కి, ఆ తర్వాత 2011లో ‘ద హేర్ అపార్ట్మెంట్’ టైటిల్‌తో విడుదలైన మరో సినిమాకి కాపీ అంటున్నారు.

అయితే అప్పట్లో అంతగా హిట్ కాని ఆ సినిమా స్టోరీ లైన్ ఆధారంగా తెలుగు నేటివిటీ దగ్గరగా త్రివిక్రమ్ స్టైల్ తో 'అజ్ఞాతవాసి' తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఇప్పటికే 'అజ్ఞాతవాసి' ప్రీ రిలీజ్ బిజినెస్ తోపాటు... శాటిలైట్ హక్కులు, ఆడియో హక్కులు రికార్డు రేటుకు అమ్ముడుపోయాయి. ఇక జనవరి 10 లోపు 'అజ్ఞాతవాసి' కి సంబందించిన వెరైటీ న్యూస్ లు ఇంకెన్ని బయటికి వస్తాయో అని పవన్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

Similar News