అంధుడి వద్ద అందాలారబోస్తున్న హెబ్బా

Update: 2017-01-14 10:30 GMT

కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం చిత్రాలతో సక్సెస్ఫుల్ పెయిర్ గా నిలిచిన యువ జంట రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ లు ముచ్చటగా మూడవ సారి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్న అందగాడు చిత్రంలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ లు మరోసారి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కన్నా ముందుగానే వీరు మూడవ సారి కలిసి కనిపించిన చిత్రం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో ప్రేమాయణంలో నలిగిపోతున్న హెబ్బా పటేల్ కి తన తండ్రి సూచించిన పెళ్లి కొడుకుగా అతిధి పాత్రలో వచ్చి మనువాడతాడు రాజ్ తరుణ్. అయితే వీరిద్దరూ హీరో హీరోయిన్లు గా నటించే మూడవ చిత్రం అందగాడు నే కానుంది.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్ సంక్రాంతి పండుగ సందర్భముగా విడుదల చేశారు. అందగాడు చిత్రంలో కథానాయకుడి పాత్ర అంధుడి పాత్ర అని ముందుగానే చెప్పిన దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ పోస్టర్ లో ఒక పార్క్ లో రాజ్ తరుణ్ పై హెబ్బా పటేల్ పడుకుని ఉండగా ఇండికేషన్ గా రాజ్ తరుణ్ కి నల్ల కళ్ళద్దాలతో పాటు పక్కన ఒక హ్యాండ్ స్టిక్ పెట్టారు. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్నట్టు కనిపిస్తున్న ఈ చిత్రంలో మరి హీరో కి అంధత్వం అనే లోపం ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

హైపర్ చిత్రంతో పరాజయం పొందిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ కి, మరో పక్క అఖిల్ చిత్రంతో కథా రచయితగా ఘోర పరాజయం చూసిన వెలిగొండ శ్రీనివాస్ కి దర్శకుడిగా ఈ చిత్రం విజయం చాలా కీలకం కానుంది.

Similar News